Begin typing your search above and press return to search.

టైగర్ నాగేశ్వరరావు బిజినెస్.. హై డిమాండ్

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు

By:  Tupaki Desk   |   24 Aug 2023 4:42 AM GMT
టైగర్ నాగేశ్వరరావు బిజినెస్.. హై డిమాండ్
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా టైగర్ నాగేశ్వరరావు. రియల్ లైఫ్ దొంగ కథతో బయోపిక్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. స్టువర్టుపురంకి చెందిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో రవితేజ కనిపించబోతున్నారు. రియల్ లైఫ్ సంఘటనలతో పాటు కాస్తా ఫిక్షనల్ టచ్ ఇచ్చి యాక్షన్ బ్లాక్స్ తో ఈ చిత్రాన్ని ఆవిష్కరిస్తున్నారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ సినిమాపై అంచనాలని అమాంతం పెంచేసింది. మాస్ మహారాజ్ రవితేజ నుంచి రాబోతున్న మరో పవర్ ఫుల్ యాక్షన్ బోనాంజాగా టైగర్ నాగేశ్వరరావు ఉంటుందని అందరూ భావిస్తున్నారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాని రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో నిర్మించారు. ఇన్ని పాజిటివ్స్ మధ్యలో సినిమా అక్టోబర్ లో దసరా కానుకగా 20న ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ డీల్స్ అన్ని క్లోజ్ అయ్యాయంట. పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న మూవీ ఒక్క తెలుగు థీయాత్రికల్ రైట్స్ పైన 50ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్ల బిజినెస్ జరిగిందంట. తెలుగు రాష్ట్రాల వరకే 30 కోట్లు మేరకు డీల్స్ జరిగినట్లు తెలుస్తోంది. ఒక ఓవర్సీస్, ఇతర భాషలకి కలుపుకొని 20 కోట్ల బిజినెస్ జరిగిందని ఇండస్ట్రీ వర్గాల మాట .

రవితేజ కెరియర్ లో కిక్ 2 తర్వాత హైయెస్ట్ బిజినెస్ డీల్స్ జరిగిన సినిమాగా టైగర్ నాగేశ్వరరావు నిలిచిపోయింది. స్టువర్టుపురం టచ్ ఉన్న కథలకి తెలుగులో మంచి డిమాండ్ ఉంది. ఆ పేరుతో వచ్చిన సినిమాలు అన్ని దాదాపు సక్సెస్ అయ్యాయి. దీంతో టైగర్ నాగేశ్వరావుతో మరోసారి ఆ బ్రాండ్ ని ఉపయోగించుకుంటున్నారు. ఇది కూడా మూవీకి కలిసొచ్చే అంశం అని చెప్పాలి.

టైటిల్ రోల్ లో రవితేజ కూడా మాసివ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చినట్లు టీజర్ తోనే స్పష్టం అయ్యింది. అనుపమ్ ఖేర్ సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా, మురళీ శర్మ అసిస్టెంట్ సూపరెండెంట్ పాత్రలలో కనిపిస్తున్నారు. అలాగే రేణు దేశాయ్ చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ ఈ చిత్రంలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటుందనేది చూడాలి.