మాస్ రాజా.. హై లెవెల్ టైగర్
మాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకి టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది
By: Tupaki Desk | 20 Sep 2023 4:57 AM GMTమాస్ మహారాజ్ రవితేజ ఈ దసరాకి టైగర్ నాగేశ్వరరావుతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. మాస్ రాజా మూవీలో రియల్ లైఫ్ రాబిన్ హుడ్ గా పేరుపొందిన టైగర్ నాగేశ్వరరావు పాత్రలో కనిపించబోతున్నారు. ఈ కథపైన, నాగేశ్వరరావు పాత్రపైన దర్శకుడు వంశీ కృష్ణ ఆకెళ్ళ ఎంతో రీసెర్చ్ చేసి సినిమా సిద్ధం చేస్తున్నారు.
ఓ వైపు స్టువర్టుపురం గ్రామ ప్రజల నుంచి సినిమాపై కొంత వ్యతిరేకత వస్తోంది. అయిన కూడా వెనక్కి తగ్గకుండా గ్రాండియర్ లో టైగర్ నాగేశ్వరరావు కథని చెప్పడానికి వంశీ కృష్ణ ముందుకి వెళ్తున్నారు. అభిషేక్ అగర్వాల్ పిక్చర్స్ బ్యానర్ పై ఈ చిత్రం భారీ బడ్జెట్ తో నిర్మితమవుతోంది. ఓ విధంగా చెప్పాలంటే రవితేజ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో ఈ మూవీ తెరకేక్కడం విశేషం.
మాస్ మహారాజ్ మార్కెట్ వేల్యూకి మించి ఈ సినిమా కోసం ఖర్చు పెట్టారు. అందుకే ఏకంగా ఐదు ఇండియన్ భాషలలో మూవీని ఏక కాలంలో రిలీజ్ చేస్తున్నారు. అక్టోబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లోకి ఈ చిత్రం రాబోతోంది. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్ యాక్టివిటీస్ చేయాలని చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. నార్త్ ఇండియాపైన కూడా గట్టి ఫోకస్ పెట్టారు.
రవితేజ కెరియర్ లో అత్యధిక థియేటర్స్ లో ఈ మూవీ రిలీజ్ కి రెడీ అవుతోంది. రావణాసుర లాంటి డిజాస్టర్ తర్వాత మాస్ మహారాజ్ రవితేజ నుంచి ఈ మూవీ రాబోతోంది. ఇప్పటికే డిజిటల్, ఆడియో రైట్స్ అత్యధిక ధరకి అమ్ముడైపోయాయి. థీయాట్రికల్ బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 55 కోట్ల వరకు రిలీజ్ బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాలలోని 30 కోట్ల మేరకు థీయాట్రికల్ బిజినెస్ టైగర్ నాగేశ్వరరావుపై జరిగింది. 1970 బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈ కథలో నుపూర్ సనన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా, రేణు దేశాయ్ ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది. యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతోంది. సినిమాలో రాబరీ కింగ్ గా రవితేజ కనిపిస్తాడు.