Begin typing your search above and press return to search.

టైగర్ సాంగ్స్.. పస లేదమ్మా

ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు

By:  Tupaki Desk   |   22 Sep 2023 4:00 AM GMT
టైగర్ సాంగ్స్.. పస లేదమ్మా
X

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో వస్తోన్న మూవీ టైగర్ నాగేశ్వరరావు. రియల్ లైఫ్ క్యారెక్టర్ ని తీసుకొని రాబిన్ హుడ్ తరహాలో కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రాన్ని దర్శకుడు సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరించారు. బయోపిక్ స్టోరీగా ఇది ప్రేక్షకుల ముందుకి రానుంది. టైటిల్ రోల్ పోషించిన రవితేజ తన స్టైల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ తో క్యారెక్టర్ కి బలం తీసుకొచ్చారు.

ఈ నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు మూవీ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. జీవీ ప్రకాష్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే టైగర్ నాగేశ్వరరావు నుంచి రెండు పాటలు ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. ఫస్ట్ సింగిల్ గా హీరోయిన్ తో లవ్ ట్రాక్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అయితే ఆ సాంగ్ ఆశించిన బజ్ క్రియేట్ చేయలేదు.

తాజాగా టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ ని రిప్రజెంట్ చేస్తూ ఎలివేషన్ సాంగ్ రిలీజ్ చేశారు. చంద్రబోస్ ఈ సాంగ్ కి సాహిత్యం అందించారు. సాంగ్ లో ఎలివేషన్ బాగానే ఉంది. కేజీఎఫ్ రాఖీభాయ్ సాంగ్ తరహాలో దీనిని డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. అయితే సాంగ్ ఆశించిన పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు. సాంగ్స్ రిలీజ్ అయిన సంగతి కూడా ప్రేక్షకుల దృష్టికి రీచ్ కాలేదు.

దసరాకి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు మూవీ నుంచి వచ్చిన అప్డేట్స్ లో ఒక్క టీజర్ మాత్రమే కాస్తా వైబ్ క్రియేట్ చేసింది. రెండు సాంగ్స్ పూర్తిగా తేలిపోయాయి. దీంతో టైగర్ నాగేశ్వరరావు చుట్టూ పెద్దగా బజ్ కనిపించడం లేదు. రవితేజ కెరియర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కి పాన్ ఇండియా రేంజ్ లో ఈ చిత్రం రిలీజ్ అవుతోంది.

మూవీ మార్కెట్ లోకి వెళ్లి అందరి దృష్టిని ఆకర్షించాలంటే కచ్చితంగా రిలీజ్ లోపు ఎక్కువ సౌండ్ చేయాల్సిందే. అప్పుడే బెస్ట్ ఓపెనింగ్స్ వస్తాయి. లేదంటే సినిమా పబ్లిక్ టాక్ బట్టి ప్రేక్షకాదరణ ఆధారపడి ఉంటుంది.