Begin typing your search above and press return to search.

జీడిమామిడి చెట్ల‌పై ర‌వితేజని ప‌రుగులెట్టించారా?

మాస్ మ‌హారాజా ర‌వితేజ స్టువ‌ర్ట్ పురం రాబిన్ హుడ్ టైగ‌ర్ నాగేశ్వ‌రావు బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే

By:  Tupaki Desk   |   3 Oct 2023 6:10 AM GMT
జీడిమామిడి చెట్ల‌పై ర‌వితేజని ప‌రుగులెట్టించారా?
X

మాస్ మ‌హారాజా ర‌వితేజ స్టువ‌ర్ట్ పురం రాబిన్ హుడ్ టైగ‌ర్ నాగేశ్వ‌రావు బ‌యోపిక్ లో టైటిల్ పాత్ర పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. ర‌వితేజ న‌టిస్తోన్న తొలి బ‌యోపిక్ ఇది. పైగా ఇదొక గ‌జ‌దొంగ స్టోరీ కావ‌డంతో సినిమాపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. ర‌వితేజ ఆ పాత్ర‌లో ఎలా క‌నిపిస్తాడు? అందుకోసం అంత‌డు ఎంత‌గా శ్ర‌మించాడు? వంటి విష‌యాలు అభిమానుల్లో హాట్ టాపిక్ గా మారాయి.

తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో సినిమా గురించి స్టంట్ మాస్ట‌ర్లు రామ్-ల‌క్ష్మ‌ణ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసారు. ' ఈ క‌థ మాకు ద‌గ్గ‌ర‌గా క‌నెక్ట్ అయింది. ఎందుకంటే మేము స్టువ‌ర్ట్ పురంలోనే పుట్టాం. టీఎన్ ఆర్ గురించి మా చిన్న‌ప్పుడు క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకునేవారు. ర‌న్నింగ్ ట్రైన్ ఎక్కేవార‌ని.. దొంగ‌త‌నం చేస్తామ‌ని చెప్పి మ‌రీ చేసేవార‌ని.. చెట్ల‌పై కూడా ప‌రుగులు పెట్టేవార‌ని.. ఇలా ఊహ‌కంద‌నివి ఆయ‌న జీవితంలో చాలా సంఘ‌ట‌నలే ఉన్నాయ‌ని అనేవారు.

ఆయ‌న ప‌నులు రియ‌ల్ హీరోని త‌ల‌పించేవాని చాలా మంది చెప్పేవారు. చెన్నై జైలు నుంచి అంత పెద్ద గొడ దూకి త‌ప్పించుకున్ త‌ర్వాత పోలీసులే అత‌నికి టైగ‌ర్ అని బిరుద ఇచ్చార‌ని అంటారు. ఇది నిజంగా ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన విషయ‌మే. ఇదే పాత్ర‌ని ర‌వితేజ పోషించ‌డం విశేషం. ఆయ‌న‌తో మేము చాలా సినిమాల‌కు ప‌నిచేసాం. కానీ ఈ సినిమా కొత్త అనుభూతినిచ్చింది. టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌కి ప‌క్కాగా సూట్ అయ్యారు.

క‌థ‌కు అన్ని బాగా కుదిరాయి. సినిమాలో ప్ర‌తీ యాక్ష‌న్ ఎపిసోడ్ ప్రేక్ష‌కులకు రియ‌ల్ అనూభూతినిస్తుంది. వాటిని నేరుగా నాగేశ్వ‌ర‌రావు నివ‌సించిన ప్రాంతంలోనూ చిత్రీక‌రించాం. ఆ ఫైట్స్ కోసం ర‌వితేజ చాలా క‌ష్ట‌ప‌డ్డారు. కొన్ని స్టంట్స్ రియ‌ల్ గానూ చేసారు. సినిమాలో వ‌చ్చే రైలు ఎపిసోడ్ ఆస‌క్తిక‌రంగా ఉంటుంది. చీరాలోని నాగేశ్వ‌రావు తిరిగిన ప్రాంతంలోనే జీడిమామిడి తోట‌ల్లో కొన్ని యాక్ష‌న్ ఎపిసోడ్లు చిత్రీక‌రించాం. అవి సినిమాకి ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తాయి. ఈ సినిమాతో ర‌వితేజ పాన్ ఇండియాకి త‌ప్ప‌కుండా రీచ్ అవుతారు. ఆయ‌న కెరీర్ లోనే ఓ మైల్ స్టోన్ మూవీ అవుతుంది' అని అన్నారు.