విక్రమ్ రాథోర్ × టైగర్ నాగేశ్వరరావు.. కిక్ ఇవ్వగలడా?
మొదట దర్శకుడు అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత సైడ్ హీరోగా కష్టపడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరో గుర్తింపునందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ
By: Tupaki Desk | 4 Oct 2023 5:30 PM GMTమొదట దర్శకుడు అవుదామని వచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆ తర్వాత సైడ్ హీరోగా కష్టపడుతూ టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి హీరో గుర్తింపునందుకున్నాడు మాస్ మహారాజా రవితేజ. హీరోగా మారిన తర్వాత కూడా పలు డిజాస్టర్స్ అయితే ఒక్కసారిగా మార్కెట్ ని డౌన్ చేశాయి. అయితే రవితేజ లో ఉన్న కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడు తగ్గలేదు.
ప్రతి సినిమాకు ఒకే తరహాలో హార్డ్ వర్క్ చేస్తూ ముందుకు వెళ్లాడు. ఇక డిజాస్టర్ కంటిన్యూ అవుతున్న తరుణంలోనే ఏదో ఒక ప్రయోగంతో సక్సెస్ తో ట్రాక్ లోకి వస్తున్నాడు. అయితే రవితేజ అప్పుడప్పుడు కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ ను సెలెక్ట్ చేసుకునే విధానం కూడా హాట్ టాపిక్ గా నిలుస్తూ ఉంటుంది.
ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు క్యారెక్టర్ కూడా అతనే కెరీర్ లో కీలక మలుపు తిప్పే అంశమని చెప్పవచ్చు. స్టువర్ట్ పురం బ్యాక్ డ్రాప్, దొంగల వ్యవహారం, మాఫియా కనెక్షన్లు ఇలా హై వోల్టేజ్ వైబ్రేషన్స్ తెప్పించే అంశాలు ఉన్న కథ కాబట్టి క్లిక్ అవ్వడానికి స్కోప్ ఉంది.
రవితేజ సినిమా కెరియర్ లో టాప్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ఏది అంటే అందరికీ ఎక్కువగా గుర్తుకు వచ్చేది మాత్రం విక్రమ్ రాథోర్ సింగ్.
రాజమౌళి దర్శకత్వంలో 2006 లో వచ్చిన విక్రమార్కుడు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. అందులో డబుల్ యాక్షన్ లో కనిపించిన రవితేజ విక్రమ్ రాథోర్ పాత్రలో అయితే సీరియస్ లుక్ లో దర్శనం ఇచ్చాడు. రాజమౌళి సైతం అసలు రవితేజ పాత్రకు న్యాయం చేస్తాడా లేదా అని అనుమానాలతో సినిమా మొదలు పెట్టాడు. కానీ రవితేజ తనలో ఉన్న కసిని మోట్ర్హం బయటపెట్టి జక్కన్నను ఆశ్చర్యపరిచాడు.
ఇక ఇన్నాళ్ళకు మళ్ళీ అలాంటి పవర్ ఫుల్ క్యారెక్టర్ తో ఆకట్టుకునే అవకాశం టైగర్ నాగేశ్వరరావు సినిమాతో రాబోతోంది. ఇప్పటివరకు విడుదలైన పోస్టర్లు టీజర్ ట్రైలర్ ద్వారా అయితే ఈ పాత్ర చాలా పవర్ఫుల్ గా చాలా మాసిగా ఉండబోతున్నట్లుగా అర్థమవుతుంది. రవితేజ ఎక్కువగా తన కెరీర్ లో కామెడీ యాంగిల్స్ లో చాలా బాగా ఆకట్టుకున్నాడు.
ఇక అతను సీరియస్ క్యారెక్టర్స్ వస్తే మాత్రం అసలు ఏ మాత్రం నిరాశపరచడు. ఇక ఇప్పుడు టైగర్ క్యారెక్టర్ కూడా అదే ఫ్లోలో క్లిక్ అవుతుంది అని కాన్ఫిడెన్స్ తో కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమా దసరా సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో విడుదల కాబోతోంది. ట్రైలర్ అయితే అంచనాల స్థాయిని మరింత పెంచేసింది. మరి విక్రమ్ రాథోర్ తరహాలోనే టైగర్ నాగేశ్వరరావు మైమరిపిస్తాడా లేదా అనేది వెండితెరపై చూడాలి.