టైగర్ ఎటాక్ ఎలా ఉండబోతుంది?
దసరా సందర్భంగా భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న ఏకంగా మూడు భాషల నుంచి మూడు సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి
By: Tupaki Desk | 10 Oct 2023 11:30 AM GMTదసరా సందర్భంగా భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 20న ఏకంగా మూడు భాషల నుంచి మూడు సినిమాలు పాన్ ఇండియాలో రిలీజ్ అవుతున్నాయి. తలపతి విజయ్ నటించిన 'లియో'...టైగర్ ష్రాప్..అమితాబచ్చన్ నటిస్తోన్న 'గణపత్'..మాస్ మహారాజా నటించిన 'టైగర్ నాగేశ్వరరావు' భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్నాయి. ఇప్పటికే ఈ మూడు సినిమాల ప్రచార చిత్రాలు రిలీజ్ అయ్యాయి.
ట్రైలర్లు ఏమంత బజ్ తీసుకురాలేదు గానీ...పాన్ ఇండియాలో రిలీజ్ అవుతోన్న నేపథ్యంలో టైగర్ నాగేశ్వరరావు కి రిలీజ్ కిది సరైనా సమయమేనా? అన్న సందేహం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే సౌత్ లో లియో అన్ని ఏరియాల్ని లాక్ చేసింది. ఆ సినిమాకి తమిళనాడు తో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రల్లో భారీ గా థియేటర్లు చేజిక్కించుకుంది. పంపిణి పరంగా ఎలాంటి సమస్య లేకుండా లైన్ క్లియర్ గా ఉంది. ఇక తెలుగులోనూ లోకేష్ కనగరాజ్ ఇమేజ్ తో సినిమాకి భారీగానే థియేటర్లు దొరికాయి.
అలాగే హిందీలోనూ ఉన్నంత లియో కి బెటర్ గానే రిలీజ్ అవుతుంది. ఇక 'గణపత్' కి తెలుగులో ఏమంత బజ్ లేదు కానీ...నార్త్ రిలీజ్ వరకూ ఎలాంటి ఇబ్బంది లేదు. మేజర్ థియేటర్ల షేర్ ఆ సినిమాకే దక్కుతుంది. ఇలాంటి సమయంలో టైగర్ నాగేశ్వరరావు కి స్థానికంగా థియేటర్ల పరంగా పర్వాలేదని పించినా మిగతా రాష్ట్రాల్లో మాత్రం ప్రతికూలంగానే ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. మిగతా చాలా చోట్ల ఆ చిత్రానికి అనుకు న్నని థియేటర్లు దొరడకం లేదని వినిపిస్తుంది.
రవితేజ అక్టోబర్ 20 కాకుండా మరోతేది వస్తే బాగుంటుంది అన్న సలహాలు తెరపైకి వస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 19న భారీ అంచనాల మధ్య నటసింహ బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి' కూడా రిలీజ్ అవుతుంది. అనీల్ సక్సెస్ రేట్..బాలయ్య ఇమేజ్ తో సినిమాపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. దీంతో టైగర్ ఈ సినిమా నుంచి కూడా గట్టిపోటీ ఎదుర్కోవాల్సి ఉంటుంది.