Begin typing your search above and press return to search.

ఆర్ సీ 16 లో టైగర్ ష్రాఫ్ ని దించుతున్నారా?

రామ్ చ‌ర‌ణ్ 'గేమ్ ఛేంజ‌ర్' విష‌యంలో క్లారిటీ లోపించ‌డంతో! ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఆర్ సీ 16కి షూటింగ్ కి రెడీ అవుతున్న‌ట్లు వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Sep 2023 1:30 PM GMT
ఆర్ సీ 16 లో టైగర్ ష్రాఫ్ ని దించుతున్నారా?
X

ఆర్ సీ 16 కి రంగం సిద్ద‌మ‌వుతోన్న సంగ‌తి తెలిసిందే. రామ్ చ‌ర‌ణ్ `గేమ్ ఛేంజ‌ర్` విష‌యంలో క్లారిటీ లోపించ‌డంతో! ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు ఆర్ సీ 16కి షూటింగ్ కి రెడీ అవుతున్న‌ట్లు వినిపిస్తోంది. ఇప్ప‌టికే స్టోరీ స‌హా స‌ర్వం సిద్దంగా ఉండ‌టంతో చ‌ర‌ణ్ రెడీ అవ్వ‌మ‌ని గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. ఈ న‌వంబ‌ర్ నుంచే షూటింగ్ షురూ చేసే ప్లాన్ లో ఉన్నట్లు స‌మాచారం. ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు కూడా ఓ కొలిక్కి వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

వివ‌రాలు లీక్ అవ్వ‌లేదు గానీ...బుచ్చి బాబు అన్ని ర‌కాలుగా సిద్ద‌మైన‌ట్లు వినిపిస్తోంది. దీనిలో భాగంగా ఇప్ప‌టికే ప్ర‌తినాయ‌కుడిగా మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తిని తీసుకున్న‌ట్లు వెలుగులోకి వ‌చ్చింది. డెబ్యూ మూవీ `ఉప్పెన`లో విజ‌య్ విల‌న్ కావ‌డంతో పాటు..పాన్ ఇండియా సినిమా కాబ‌ట్టి మ‌ళ్లీ త‌న విల‌న్ సేతుప‌తి అయిన‌ట్లు బ‌ల‌మైన ప్ర‌చారం సాగింది. అయితే అధికారిక స‌మాచారం లేదు కాబ‌ట్టి అందులో వాస్త‌వం తెలియ‌దు.

ఈ నేప‌థ్యంలో చ‌ర‌ణ్ ని ఢీ కొట్టేది మ‌క్క‌ల్ సెల్వ‌న్ కాదు..బాలీవుడ్ కండ‌ర గండ‌డు టైగర్ ష్రాఫ్ అని కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. బుచ్చి బాబు రాసుకున్న పాత్ర‌కి టైగ‌ర్ అయితే బాగుంటుంద‌ని భావించి అత‌న్నే దించుతున్న‌ట్లు కొత్త ప్ర‌చారం తెర‌పైకి వ‌స్తోంది. ఆపాత్ర‌కి కొత్త న‌టుడైతే బాగుంటుంద‌ని..ఫిజిక్ ప‌రంగా చ‌ర‌ణ్ ని మ్యాచ్ చేయాలంటే? టైగర్ ష్రాఫ్ లాంటి న‌టుడైతే ప్రేక్ష‌కుల‌కు కొత్త అనుభూతి క‌లుగుతుందని బుచ్చి బాబు భావిస్తున్న‌ట్లు వినిపిస్తోంది.

అదే నిజ‌మైతే సినిమాకి ప్రెష్ ఫీల్ ని తీసుకొస్తుంది. ఇంత‌ర‌వ‌కూ టైగర్ ష్రాఫ్ కూడా తెలుగులో లాంచ్ అవ్వ‌లేదు. ప్ర‌స్తుతం బాలీవుడ్ హీరోలంతా టాలీవుడ్ వైపు చూస్తున్నారు. ఛాన్స్ ఇస్తే దూకేయ‌డానికి సిద్దంగా ఉన్నారు. అలాంటి ఛాన్స్ టైగ‌ర్ ముందున్న‌ట్లు క‌నిపిస్తోంది. మ‌రి ఈ ఛాన్స్ నిజ‌మైతే టైగ‌ర్ ఎంత‌వ‌ర‌కూ స‌ద్వినియోగం చేసుకుంటాడో చూడాలి. జాకీష్రాప్ వార‌సుడిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన టైగర్ ష్రాఫ్ అన‌తి కాలంలో స్టార్ గా ఎదిగిన సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ లో యాక్ష‌న్ చిత్రాల‌కు పెట్టింది పేరుగా దూసుకుపోతున్నాడు.