స్టార్ హీరో పారితోషికంలో భారీ కోత!
ఈ నేపథ్యంలో కొత్త అవకాశాలు రావాలంటే ఫీజులో కొత తప్పని సరిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
By: Tupaki Desk | 18 May 2024 10:30 AM GMTబాలీవుడ్ హీరో టైగర్ ష్రాప్ కి సరైన హిట్ పడి చాలా కాలమవుతోంది. ఇటీవల రిలీజ్ అయిన 'బడేమియాన్ చోటేమియాన్' కూడా భారీ డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దీంతో టైగర్ ఖాతాలో వరుసగా హ్యాట్రిక్ ప్లాప్ లు నమోదయ్యాయి. 'భాఘీ-3' తర్వాత టైగర్ కి హిట్ లేదు. 'హీరో పంటీ', 'అగ్నిపత్' కూడా బాక్సాఫీస్ వద్ద తేలిపోయిన చిత్రాలే. బడేమియాన్ తోనూ అదే పరిస్థితి. ఈ సినిమాకి గాను టైగర్ ష్రాఫ్ 30 కోట్లు పారితోషికం తీసుకున్నాడు.
కానీ వసూళ్లు చూస్తే 100 కోట్లు కూడా లేవు. దీంతో టైగర్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు మీడియాలో వార్త లొస్తున్నాయి. తన పారితోషికం భారీగా తగ్గించుకున్నాడని కథనాలు వెడెక్కిస్తున్నాయి. టైగర్ ష్రాఫ్ గతంలో 9 కోట్లు పారితోషికం తీసుకునేవాడు. బడేమియాన్ చిత్రానికే అత్యధికంగా 30 కోట్లు చార్జ్ చేసాడు. కానీ వరుసగా మూడు వైఫల్యాల నేపథ్యంలో మార్కెట్ పడిపోయింది. ఈ నేపథ్యంలో కొత్త అవకాశాలు రావాలంటే ఫీజులో కొత తప్పని సరిగా భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
ప్రస్తుతం టైగర్ ష్రాప్ రెండు సినిమాలు చేస్తున్నాడు. ఈగల్ అనేది ఒక సినిమా కాగా 'సింగం ఎగైన్' లో ఏసీపీ పాత్ర పోషిస్తున్నాడు. 'ఈగిల్' ప్రాజెక్ట్ కూడా పెండింగ్ లో పడింది. ఆ సినిమా షూట్ దశలో బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. అది ఎప్పుడు పూర్తవుతుంది? ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్నది క్లారిటీ లేదు. సింగం ఎగైన్ లో గెస్ట్ రోల్ లాంటింది. అది హిట్ అయినా? ఫట్ అయినా టైగర్ సాధించేది ఏం లేదు? కాబట్టి తాను ఉన్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు కొత్త అవకాశాలు అందుకోవాలి.
వాటిని వెంటనే పట్టాలెక్కించాలి. అంతే వేగంగానూ రిలీజ్ చేయాలి. లేదంటే హీరో మార్కెట్ పై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇవన్నీ ఆలోచించే టైగర్ కూడా పారితోషికంలో కోత విధించినట్లు మీడియాలో కథనాలు వైరల్ అవుతున్నాయి. ఇదే నిజమైతే హీరో తీసుకున్నది సరైన నిర్ణయమే. ఆసలే సినిమా బడ్జెట్ వోవర్ ది బోర్డ్ అవుతుందని చాలా కాలంగా వినిపిస్తుంది. హీరోలంతా పారితోషికం తగ్గించుకోవాలన్న డిమాండ్లు ఉన్నాయి.