Begin typing your search above and press return to search.

'టైగర్ Vs పఠాన్‌' ఫేసాఫ్‌కి ముహూర్తం ఫిక్స్

ఫిబ్రవరి 2024 నుండి టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తార‌నేది ఇప్ప‌టికే తెలిసిన విష‌యం. ఇద్దరు సూపర్ స్టార్‌లు ఇప్పటికే సినిమా కోసం బల్క్ డేట్‌లను కేటాయించారు.

By:  Tupaki Desk   |   25 Aug 2023 12:30 AM GMT
టైగర్ Vs పఠాన్‌ ఫేసాఫ్‌కి ముహూర్తం ఫిక్స్
X

ప‌ఠాన్ త‌ర్వాత మోస్ట్ అవైటెడ్ 2023 మూవీస్ జాబితాలో టైగ‌ర్ 3 - ఫైట‌ర్ చిత్రాలు ఉన్నాయి. ఈ సినిమాల త‌ర్వాత టైగ‌ర్ ఫ్రాంఛైజీలోనే రూపొంద‌నున్న "టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్" పైనా స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది. దాదాపు 600కోట్ల బ‌డ్జెట్ తో రూపొంద‌నున్న ఈ చిత్రంపై బోలెడంత ఉత్కంఠ నెల‌కొంది. ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు ప్రారంభ‌మ‌వుతుంది? అంటూ అభిమానుల్లో ఒక‌టే ఎగ్జ‌యిట్ మెంట్ కొన‌సాగుతోంది. షారుఖ్ ఖాన్ - సల్మాన్ ఖాన్ మధ్య ఫేసాఫ్‌ సన్నివేశంతో "టైగర్ వర్సెస్ పఠాన్" షూటింగ్ ప్రారంభమ‌వుతుంద‌ని తాజాగా లీక్ అందింది.

ఫిబ్రవరి 2024 నుండి టైగర్ వర్సెస్ పఠాన్ చిత్రీక‌ర‌ణ ప్రారంభిస్తార‌నేది ఇప్ప‌టికే తెలిసిన విష‌యం. ఇద్దరు సూపర్ స్టార్‌లు ఇప్పటికే సినిమా కోసం బల్క్ డేట్‌లను కేటాయించారు. పఠాన్ లో వీరిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూసిన అభిమానులు మళ్లీ క‌లిసి క‌నిపిస్తే చూడాలని వేచి చూస్తున్నారు. SRK టైగర్ 3 లో అతిధి పాత్రలో న‌టించ‌గా.. టైగర్ Vs పఠాన్ కూడా ఈ క్రేజీ ఫ్రాంఛైజీలో భాగం కాబోతోంద‌ని వెల్ల‌డైంది. తాజా రిపోర్ట్ ప్రకారం.. ఈ చిత్రం యష్ రాజ్ ఫిల్మ్స్ కి అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్. ఫైటర్ తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ ఈ క్రేజీ మూవీకి దర్శకత్వం వహిస్తారు. మిడ్-డే తాజా నివేదిక ప్ర‌కారం.. అక్టోబర్‌లో సినిమా ప్రీ-ప్రొడక్షన్ ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

ఫైటర్ విడుదల తర్వాత 2024 జనవరి లేదా ఫిబ్రవరిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హృతిక్ రోషన్, దీపికా పదుకొణె జంట‌గా న‌టిస్తున్న‌ ఫైట‌ర్ చిత్రాన్ని పూర్తి చేయడానికి సిద్ధార్థ్ ఇంకా రెండు నెలల సమయం తీసుకుంటున్నాడు. లీడ్ పెయిర్‌తో ఇంటర్నేషనల్ లొకేషన్‌లో చిత్రీకరించనున్న పాట చిత్రీకరణ మిగిలి ఉంది. ఇంతలోనే నిర్మాత‌ ఆదిత్య చోప్రా ఫైట‌ర్ కి ప‌ని చేసిన టెక్నీషియ‌న్ల‌నే త‌దుప‌రి చిత్రానికి ఫైన‌ల్ చేయ‌నున్నార‌ని తెలిసింది. నిజానికి VFX బేస్డ్ సినిమాల విష‌యంలో ఎటువంటి రాజీ లేకుండా ప‌ని చేసేందుకు య‌ష్ రాజ్ ఫిలింస్ భారీ పెట్టుడుల్ని కుమ్మ‌రించ‌నుందని తెలుస్తోంది. తాజా క‌థ‌నాల ప్రకారం.. టైగర్ Vs పఠాన్ షూటింగ్ ఇద్ద‌రు దిగ్గ‌జ స్టార్ల న‌డుమ భారీ ఫైట్.. నాటకీయ ఘర్షణ సన్నివేశంతో ప్రారంభమవుతుంది. పఠాన్ వ‌ర్సెస్ టైగర్ ఫేసాఫ్ ముహూర్తం ఫిక్స‌యింది.

ఇద్దరు సూపర్ స్టార్లు ఇప్పటికే ఈ చిత్రం మొదటి షెడ్యూల్ కోసం తమ తేదీలను ఇచ్చారు. అన్నీ సవ్యంగా జరిగితే, మొదటి షెడ్యూల్ షూట్ ఫిబ్రవరి 2024 నుండి మే 2024 వరకు జరుగుతుంది. ఇప్ప‌టికే కథ సిద్ధ‌మైంది. అయితే మరింత డీటెయిలింగ్ తో స్క్రిప్ట్ లాక్ చేసుకున్న తర్వాత ఇద్దరు స్టార్ల‌కు బౌండ్ స్క్రిప్టును అంద‌జేయ‌నున్నారు. టైగర్ వర్సెస్ పఠాన్ హాలీవుడ్ మాదిరిగానే దేశంలోని ఇద్దరు సూపర్‌స్టార్ల కలయికలో మొదటి భారీ చిత్రం అవుతుంది. షారూఖ్ ఇప్ప‌టికే స‌ల్మాన్ టైగ‌ర్ 3లో అతిధి పాత్రలో కనిపించ‌నున్నాడు. ఇది అభిమానులను ఎంతో ఎగ్జ‌యిట్ చేస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం షారుక్ "జవాన్" సినిమాని ముందుగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సెప్టెంబర్ 7న విడుదల కానున్న ఈ చిత్రానికి అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు.