టిల్లు ఫ్యాన్స్ అలర్ట్.. ఆ క్యారెక్టర్ తో అసలైన ట్విస్ట్
మార్చి 29వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో సౌత్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
By: Tupaki Desk | 25 Feb 2024 8:31 AM GMTడీజే టిల్లు మూవీతో స్టార్ హీరో అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. ఈ మూవీ పేరునే తన పేరుగా మార్చుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా సీక్వెల్ తో త్వరలోనే సిద్ధు రాబోతున్న విషయం తెలిసిందే. ఫస్ట్ పార్ట్ తెరకెక్కించిన మల్లిక్ రామ్.. టిల్లు స్క్వేర్ కు కూడా డైరెక్షన్ వహిస్తున్నారు. మార్చి 29వ తేదీన వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానున్న ఈ సినిమాలో సౌత్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. పోస్టర్స్, టీజర్, సాంగ్స్, గ్లింప్స్ అన్నీ టిల్లు స్క్వేర్ పై అంచనాలను ఆకాశానికి ఎత్తేశాయి. ఎప్పుడెప్పుడా ఈ సినిమా వస్తుందని సినీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఫస్ట్ పార్ట్ తో పోలిస్తే సీక్వెల్ లో యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ అన్నీ డబుల్ ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.
డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ కావడంలో హీరోయిన్ నేహాశెట్టి పోషించిన రాధిక రోల్ కూడా కీలకమనే చెప్పవచ్చు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ లో రాధిక పాత్ర ఉందని మేకర్స్ క్లారిటీ ఇవ్వకపోయినా.. పేరు మాత్రం తెగ వాడేశారు. ప్రేమ, పెళ్లి టాపిక్ కు సంబంధించి హీరో చెప్పే అన్ని డైలాగుల్లో రాధిక పేరే ఉంటోంది. దీంతో ఈ మూవీలో గెస్ట్ రోల్ అయిన రాధిక చేసి ఉంటే బాగుండేదని చాలా మంది అనుకుంటున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం.. టిల్లు స్క్వేర్ లో రాధిక ఉందట. క్యామియో రోల్ పోషిస్తోంది. ఓ 15 నిమిషాల పాటు సందడి చేయనుందట. మేకర్స్ ఆమె రోల్ ను పక్కన పెట్టలేదట. ఇప్పుడు నెట్టింట ఈ మ్యాటర్ ఫుల్ ట్రెండ్ అవుతోంది. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. రాధిక అక్క ఉందోచ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. సీక్వెల్ లో అనుపమ క్యారెక్టర్.. రాధిక రోల్ కు మించి ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది.
మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగ వంశీ ప్రొడ్యూస్ చేస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ బ్యానర్లపై తెరకెక్కుతోంది ఈ మూవీ. ఉగాది పండుగకు సరిగ్గా పదిరోజుల ముందు థియేటర్లలోకి విడుదల అవుతుంది. సూపర్ హిట్ టాక్ వస్తే.. వసూళ్ల విషయంలో టిల్లు స్క్వేర్ కు ఇక తిరుగు లేనట్లే. మరేం జరుగుతుందో చూడాలి.