Begin typing your search above and press return to search.

ఓవర్సీస్ టిల్లు స్క్వేర్.. అక్కడ కూడా ఇదే లెక్క!

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు అయిన నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే రేంజ్ సినిమాలు పడలేదు.

By:  Tupaki Desk   |   2 April 2024 4:11 AM GMT
ఓవర్సీస్ టిల్లు స్క్వేర్.. అక్కడ కూడా ఇదే లెక్క!
X

సిద్దూ జొన్నలగడ్డ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా టిల్లు స్క్వేర్ మూవీ దూసుకుపోతోంది. ఓ విధంగా చెప్పాలంటే సిద్దు కెరియర్ డీజే టిల్లుకి ముందు ఆ తరువాత అనొచ్చు. డీజే టిల్లు సినిమా వరకు సిద్దు జొన్నలగడ్డ అంటే చాలా మందికి తెలియదు. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 15 ఏళ్ళు అయిన నటుడిగా ప్రేక్షకుల్లో గుర్తుండిపోయే రేంజ్ సినిమాలు పడలేదు.

కృష్ణ అండ్ హిజ్ లీల, మా వింత గాధ వినుమా అంటూ రొమాంటిక్ లవ్ స్టోరీలతో మెల్లగా యూత్ ఆడియన్స్ కి కనెక్ట్ అయిన సిద్దు కెరియర్ ని డీజే టిల్లు ఒక్కసారిగా టర్న్ చేసేసింది. ఆ సినిమాలో సాంగ్స్, టిల్లు క్యారెక్టర్ విపరీతంగా ఆడియన్స్ కి కనెక్ట్ అయిపొయింది. కాంటెంపరరీ స్టోరీలైన్ టిల్లు క్యారెక్టర్ తోడవడంతో ప్రతి ఒక్కరు స్టోరీని రిలేట్ చేసుకున్నారు.

డీజే టిల్లుకి సీక్వెల్ గా వచ్చిన టిల్లు స్క్వేర్ మీద మొదటి పార్ట్ ఇంపాక్ట్ గట్టిగానే ఉంది. అందుకే మొదటిరోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ వచ్చాయి. అయితే టిల్లు గాడి స్టోరీ కేవలం తెలుగు రాష్ట్రాలలో ఆడియన్స్ కి మాత్రమే కాకుండా ఓవర్సీస్ లో కూడా మంచి క్రేజ్ అందుకుంటోంది. విదేశాల్లో కొన్ని మల్టీప్లెక్స్ థియేటర్స్ లో హౌస్ ఫుల్ షోలు పడుతున్నాయి. మొదటి మూడు రోజుల్లోనే ఈ సినిమా ఏకంగా 2.2 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేయడం విశేషం.

ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 18.32 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యింది. నార్త్ అమెరికాలో 15.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఆస్ట్రేలియాలో 1.06 కోట్ల గ్రాస్ వసూళ్లు అయ్యాయి. న్యూజిలాండ్ లో 8.04 కోట్లు, యూకే అండ్ ఐర్లాండ్ లో 82.3 లక్షలు, యునైటెడ్ అరబిక్ ఎమిరేట్స్ లో 41.7 లక్షలు, గల్ఫ్ దేశాల్లో 28.18 లక్షలు, రెస్ట్ ఆఫ్ వరల్డ్ లో 25 లక్షల గ్రాస్ కలెక్షన్స్ టిల్లు స్క్వేర్ చిత్రానికి వచ్చాయి.

ఈ కలెక్షన్స్ లెక్కలు చూసుకుంటే చిన్న హీరోల చిత్రాలలో ఓవర్సీస్ మార్కెట్ లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీ టిల్లు స్క్వేర్ అవుతుందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పాజిటివ్ టాక్ తో ఇదే స్థాయిలో కలెక్షన్స్ కొనసాగితే లాంగ్ రన్ లో 4 మిలియన్ డాలర్స్ క్లబ్ లో చేరిన చిన్న సినిమాగా టిల్లు స్క్వేర్ నిలిచే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.

నార్త్ అమెరికాలో - $1,846,222 - ₹15.4 కోట్లు

ఆస్ట్రేలియా - A$195,573 - ₹1.06 కోట్లు

న్యూజిలాండ్ - NZ$16,206 - 8.04 లక్షలు

యూకే & ఐర్లాండ్ - £78,466 - ₹82.3 లక్షలు

యూఏఈ - - $50K - 41.7 లక్షలు

గల్ఫ్ కంట్రీస్ - $35K - *29.18 లక్షలు

రెస్ట్ ఆఫ్ వరల్డ్ - 25 లక్షలు

టోటల్ ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 18.32 కోట్ల గ్రాస్