Begin typing your search above and press return to search.

టిల్లు స్క్వేర్.. సేఫ్ గేమ్ కు సిద్ధం!

కానీ సితార అనుబంధ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ లోనే వస్తున్న గుంటూరు కారం సంక్రాంతిలో హడావుడి క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది.

By:  Tupaki Desk   |   27 Oct 2023 9:30 AM GMT
టిల్లు స్క్వేర్.. సేఫ్ గేమ్ కు సిద్ధం!
X

టాలెంటెడ్ యువ హీరో సిద్దు జొన్నలగడ్డ నటించిన DJ టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి కలెక్షన్స్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే మళ్లీ ఆ సినిమాకు తరహాలోనే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ హీరో టిల్లు స్క్వేర్ తో అదృష్టం పరీక్షించుకోబోతున్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో నాగవంశి నిర్మించిన ఈ సినిమా లో అనుపమ పరమేశ్వరన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తోంది.


అయితే ఈ సినిమా విడుదల విషయంలో చాలా కాలంగా అనేక రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అసలైతే ఈ ఏడాదిలోని సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. ముఖ్యంగా డిసెంబర్లో సినిమా రాబోతోంది ఉన్నట్లుగా చాలా రకాల టాక్స్ అయితే వినిపించాయి. అయితే ఇప్పుడు ఫైనల్ గా టిల్లు స్క్వేర్ ఈ ఏడాదిలో రావడం లేదు అని క్లారిటీ వచ్చేసింది.

2024 ఫిబ్రవరి 29వ తేదీన సినిమాను గ్రాండ్గా విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ఒక పోస్టర్ కూడా విడుదల చేశారు. మొత్తానికి టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో నిర్మాత చాలా తెలివిగానే ఆలోచించారని ఇంకా తెలుస్తోంది. డిసెంబర్ లో విడుదల చేయడానికి కంటెంట్ రెడీగా ఉన్నప్పటికీ అక్కడ పోటీ చాలా ఎక్కువగా ఉండడంతో మళ్ళీ సంక్రాంతి కోసమని కూడా ఆలోచించారు.

కానీ సితార అనుబంధ సంస్థ హారిక హాసిని ప్రొడక్షన్ లోనే వస్తున్న గుంటూరు కారం సంక్రాంతిలో హడావుడి క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇక జనవరిలో కూడా మరికొన్ని సినిమాలో మధ్యలో పోటీ ఉండబోతోంది. ఇక ఈ క్లాష్ మధ్యలో కంటెంట్ ఫేడ్ అవుట్ అయిపోకూడదు అని మేకర్స్ కాస్త ఎక్కువ సమయం తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు.

ఇక మొత్తానికి ఎలాంటి పోటీ లేకుండా ఫిబ్రవరిలోనే ఆడియేన్స్ ముందుకు రావడానికి సిద్ధమయ్యారు. డీజే టిల్లు భారీ స్థాయిలో సక్సెస్ కావడంతో సిద్ధం జొన్నలగడ్డ ఈ సినిమాపై చాలా హోప్స్ అయితే పెట్టుకున్నాడు. మరో రేంజ్ కు వెళ్లే విధంగా ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలని ఆలోచనలో ఉన్నాడు.

ఇక ఈ సినిమా కు సంబంధించిన ఒక సాంగ్ కూడా ఇటీవల విడుదల చేశారు. ఇక డీజే టిల్లులో నటించిన నేహ శెట్టి కూడా ఇందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ తో సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ తో పాటు శ్రీకరం స్టూడియోస్ అలాగే ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.