Begin typing your search above and press return to search.

ఈ ట్రైలర్ తో ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?

కంప్లీట్ ఎంటర్టైనర్ గా డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో దాన్ని కొనసాగించేలా మేకర్స్ ప్లాన్ చేశారు

By:  Tupaki Desk   |   15 Feb 2024 4:30 PM GMT
ఈ ట్రైలర్ తో ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..?
X

ఒక సినిమా హిట్ అవ్వాలంటే యూత్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తే చాలు.. వారికి నచ్చే అంశాలు కంప్లీట్ గా అది ఎమోషనల్ లవ్ స్టోరీ అయినా.. ఎంటర్టైన్మెంట్ అయినా.. లేదా ఇంకేమైనా సరే వారికి నచ్చేస్తే సినిమా సూపర్ హిట్ అన్నట్టే లెక్క. అందుకే వారిని దృష్టిలో పెట్టుకునే కొన్ని సినిమాలు చేస్తారు. అయితే కేవలం ఒక జోనర్ లో సినిమాల సంగతి వేరుగా ఉంటుంది. ఇలా యూత్ ఆడియన్స్ నే బేస్ చేసుకుని తీసిన సినిమా డీజే టిల్లు. సిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో తెరకెక్కిన డీజే టిల్లు యూత్ ఆడియన్స్ ఆమోదం మాత్రమే కాదు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ఆడియన్స్ అంతా వారెవా అనేశారు.

కంప్లీట్ ఎంటర్టైనర్ గా డీజే టిల్లు సెన్సేషనల్ హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవ్వడంతో దాన్ని కొనసాగించేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అందుకు తగినట్టుగానే కథ కథనాలు రాసుకుని టిల్లు స్క్వేర్ తీశారు. ఈ టిల్లు స్క్వేర్ సినిమా మార్చి 29న రిలీజ్ అవుతుంది. ఈ ట్రైలర్ చూస్తే సినిమాలో మ్యాటర్ ఏంటన్నది అర్థమవుతుంది. సిద్ధు మార్క్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో పాటుగా ఈసారి అనుపమ రూపంలో గ్లామర్ డోసేజ్ కూడా ఘాటుగానే ఉండేలా ఉంది.

డీజే టిల్లు వచ్చినప్పుడు ఎలాంటి అంచనాలు లేవు అందుకే ఆ సినిమా ఊహించని విధంగా సూపర్ హిట్ అయ్యింది. కానీ టిల్లు స్క్వేర్ పరిస్థితి అలా కాదు. సినిమాపై హై ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. సినిమా కచ్చితంగా ఆ టార్గెట్ రీచ్ అవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు సినిమా ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా ఉంది కాబట్టి టిల్లు కి కొడితే 100 కోట్లు వచ్చి పడినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

టిల్లు స్క్వేర్ బజ్ చూస్తే అది పెద్ద కష్టమేమి కాదని అనిపిస్తుంది. డీజే టిల్లు కేవలం యూత్ కోసమే తీస్తే దాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఆదరించారు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ కోసం ఫ్యామిలీస్ అండ్ యూత్ ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. వాళ్లని మెప్పించేలా సినిమా ఉంటే మాత్రం సిద్ధు జొన్నలగడ్డ ఖాతాలో మరో సూపర్ హిట్ పడినట్టే లెక్క. ఈ సినిమాపై యూత్ లో ఉన్న ఈ ఇంట్రెస్ట్ ని క్యాష్ చేసుకునేలా టిల్లు స్క్వేర్ ప్రమోషన్స్ కూడా భారీగా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. మరి టిల్లు స్క్వేర్ ఆశించిన స్థాయిలో అలరిస్తాడా అనుకున్న టార్గెట్ రీచ్ అవుతాడా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది.