టిల్లు స్క్వేర్ అది అడ్వాంటేజ్ అవుతుందా..?
విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది.
By: Tupaki Desk | 13 Feb 2024 1:19 PM GMTసిద్ధు జొన్నలగడ్డ లీడ్ రోల్ లో రెండేళ్ల క్రితం వచ్చిన డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. విమల్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి యూత్ ఆడియన్స్ ని విపరీతంగా అలరించింది. మౌత్ టాక్ తో సెన్సేషనల్ హిట్ అయిన డీజే టిల్లు సినిమాకు కొనసాగింపుగా టిల్లు స్క్వేర్ రాబోతుంది. టిల్లు స్క్వేర్ సినిమాను మల్లిక్ రామ్ డైరెక్ట్ చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.
మార్చి 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై లేటెస్ట్ అప్డేట్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమాకు రామ్ మిర్యాల, శ్రీ చరణ్ పాకాల మ్యూజిక్ అందిస్తున్నారు. అయితే సినిమాకు బిజిఎం మాత్రం థమన్ అందిస్తున్నారని తెలుస్తుంది. మణిశర్మ తర్వాత సినిమాలకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టేయడం థమన్ వల్లే అవుతుంది. సినిమాలకు సాంగ్స్ అండ్ బిజిఎం ఇవ్వడంతో పాటుగా కొన్ని సినిమాలకు స్పెషల్ గా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రమే అందిస్తుంటాడు.
ఈ క్రమంలో టిల్లు స్క్వేర్ సినిమాకు థమన్ బిజిఎం అందించడం విశేషం. అంతేకాదు ఈ సినిమాకు ఉన్న అంచనాలను అందుకునేలా థమన్ క్రేజీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడని తెలుస్తుంది. టిల్లు స్క్వేర్ సినిమాకు థమన్ ఎంత ప్లస్ అవుతాడు. థమన్ బిజిఎం టిల్లుకి ఎలా కలిసి వస్తుంది అన్నది చూడాలి. ఓ పక్క స్టార్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తూనే మరోపక్క ఇలాంటి స్పెషల్ సినిమాలకు బిజిఎం అందిస్తూ తన సత్తా చాటుతున్నాడు థమన్.
టిల్లు స్క్వేర్ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించడం అంత సామాన్యమైన విషయం కాదు. సినిమాలో టిల్లు డీజే ప్లేయర్ కాబట్టి అందుకు తగినట్టుగానే బిజిఎం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే ఈ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇస్తున్నందుకు కూడా థమన్ కు మంచి రెమ్యునరేషన్ అందిస్తున్నారట సితార నిర్మాతలు. మరి ఈ టిల్లుకి థమన్ మ్యూజిక్ ఏ విధంగా హెల్ప్ చేస్తుంది అన్నది చూడాలి. మార్చి 29న టిల్లు స్క్వేర్ వస్తుంది. సినిమాపై యూత్ లో ఉన్న హైప్ ని మరింత పెంచేలా చిత్ర యూనిట్ వెరైటీ ప్రమోషన్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి టిల్లు స్క్వేర్ సిద్ధు ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ పడేలా చేస్తుందా లేదా అన్నది ఈ నెల చివరన తెలుస్తుంది. కొన్నాళ్లుగా సరైన డేట్ కోసం ఎదురుచూసిన మేకర్స్ ఫైనల్ గా మార్చి 29న వస్తున్నారు. మరి సినిమా పై ఉన్న బజ్ కి అదే రేంజ్ అవుట్ పుట్ అందిస్తారా లేదా అన్నది సినిమా వస్తేనే తెలుస్తుంది.