వల్గర్ డ్రెస్‌లు ధరించమన్నాడు.. దర్శకుడితో నటి గొడవ!
కానీ షూటింగ్ మొదటి రోజు మాధురీ దీక్షిత్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అనుకున్న సీన్ ని తెరకెక్కించేందుకు మాధురి సహకరించలేదు.
By: Tupaki Desk | 8 Sep 2023 4:55 AM GMTసినిమా సెట్లో అప్పుడప్పుడు గొడవలు రచ్చకెక్కుతుంటాయి. క్లాసిక్ డేస్ నుంచి ఇవి చూస్తున్నవే. అప్పట్లోనే ప్రముఖ సీనియర్ దర్శకుడితో పాపులర్ కథానాయిక గొడవ ప్రజల్లో హాట్ టాపిక్ అయింది. హీరోయిన్ ని అతడు తీవ్రంగా ఇబ్బంది పెట్టాడని కూడా గుసగుసలు వినిపించాయి. అయితే ఆ వివాదం గురించి నేరుగా సదరు దర్శకనటుడు ఇన్నాళ్టికి బహిరంగంగా ఓపెనయ్యాడు. ఇంతకీ సదరు దర్శకుడు ఎవరు? అతడితో గొడవ పడిన కథానాయిక ఎవరు? అంటే వివరాల్లోకి వెళ్లాలి.
'కాలియా', షాహెన్‌షా వంటి చిత్రాలతో పాపులరైన ప్రముఖ నటుడు-దర్శకుడు టిన్ను ఆనంద్ గురించే ఇదంతా. అతడు కథానాయిక మాధురి ధీక్షిత్ తో తన వివాదం గురించి తాజా ఇంటర్వ్యూలో ఓపెనయ్యాడు. 1989లో అమితాబ్ బచ్చన్ - మాధురీ దీక్షిత్ ప్రధాన పాత్రలలో 'శనఖ్త్' అనే చిత్రం తెరకెక్కిస్తున్నాను.
కానీ షూటింగ్ మొదటి రోజు మాధురీ దీక్షిత్ తో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. అనుకున్న సీన్ ని తెరకెక్కించేందుకు మాధురి సహకరించలేదు. సన్నివేశం ప్రకారం తన లోదుస్తులు ధరించి ఆ సీన్ చేయాల్సి ఉంది. కానీ దానికి మాధురి నిరాకరించారు.
తనను నిరాకరించిన మాధురిపై ఎలా మాటల తూటాలు పేల్చాడో టిను ఇప్పుడు బహిరంగంగా వెల్లడించాడు. అయితే మాధురి సినిమా కోసం సంతకం చేసే ముందు మొత్తం సన్నివేశాన్ని తాను వివరించినట్లు పేర్కొన్నాడు. దానికి మాధురి కూడా అంగీకరించింది.
కానీ సెట్లో ఆ సీన్ చేయనని మొరాయించిందని టిను ఆనంద్ పేర్కొన్నాడు. దాదాపు గంటపాటు ఆమె డ్రెస్సింగ్ రూమ్ నుంచి బయటకు రాలేదు. ఈ ప్రత్యేక సన్నివేశం చేయడం తనకు ఇష్టం లేదని చెప్పింది.
కానీ దర్శకుడు టిను మాధురితో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. ఆ తర్వాత ఆమెను సినిమా నుండి దాదాపు తొలగించాడు. తరువాత, అమితాబ్ బచ్చన్ వచ్చినప్పుడు, మాధురితో తన వాదన గురించి టిన్ను అతనికి తెలియజేశాడు. వారి మధ్య గొడవ చల్లార్చడానికి బిగ్ బి ప్రయత్నించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు పెద్దరికం వహించాంరు. ఆ తర్వాత మాధురి ఆ సన్నివేశం చేయడానికి అంగీకరించింది. కానీ ఐదు రోజుల పాటు చిత్రీకరించిన తర్వాత సినిమాని పూర్తిగా నిలిపేసారు.