మ్యూజిక్ లేబుల్‌కి డబుల్ ధమాకా రెవెన్యూ
సినిమాల నిర్మాణంలోను ఈ సంస్థలు అద్భుతంగా రాణిస్తున్నాయి.
By: Tupaki Desk | 18 Oct 2024 3:00 AM GMTభారతదేశంలో పాపులర్ మ్యూజిక్ లేబుల్స్ ఏటేటా భారీ ఆదాయాలను కళ్లజూస్తున్నాయి. ముఖ్యంగా దశాబ్ధాల చరిత్రతో ఎదురేలేని విధంగా వ్యాపార సామ్రాజ్యాల్ని విస్తరించిన టిప్స్ మ్యూజిక్, టీ సిరీస్, సారేగామ వంటి సంస్థలు తమ కార్యకలాపాలను సినీరంగంలో విభిన్న మార్గాల్లో విస్తరించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నాయి. సినిమాల నిర్మాణంలోను ఈ సంస్థలు అద్భుతంగా రాణిస్తున్నాయి.
అయితే వీటిలో పేరెన్నిక గన్న టిప్స్ మ్యూజిక్ లిమిటెడ్ గొప్ప ఆదాయ ఆర్జనతో వార్తలకెక్కింది. గతంలో టిప్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని పిలుచుకున్న ఈ సంస్థ ఈసారి డబుల్ ధమాకా లాభాల్ని దాని యజమానికి అందించింది. 30 సెప్టెంబర్ 2024తో ముగిసే త్రైమాసికానికి ఆర్థిక ఫలితాలను టిప్స్ సంస్థ ప్రకటించింది. ఇండియన్ మ్యూజిక్ లేబుల్ టిప్స్ పోటీ పరిశ్రమలో బలమైన పనితీరును ప్రదర్శిస్తూ అనేక కీలక మెట్రిక్‌లలో బలమైన వృద్ధిని నమోదు చేసింది. FY25 రెండవ త్రైమాసికంలో టిప్స్ మ్యూజిక్ కార్యకలాపాల ద్వారా రూ. 80.6 కోట్లు, తో పోలిస్తే 32 శాతం వార్షిక వృద్ధిని సాధించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో 60.9 కోట్లు ఆర్జించగా 20కోట్లు ఈసారి అదనంగా ఆర్జించింది. గత త్రైమాసికం నుండి ఈ పెరుగుదల ట్రెండ్ కొనసాగుతోంది. ఈసారి రూ. 73.9 కోట్లుగా నమోదవ్వగా ఈ త్రైమాసికానికి 9 శాతం పెరుగుదలను నమోదు చేసింది. FY25 మొదటి అర్ధభాగంలో మొత్తం ఆదాయం రూ. 154.5 కోట్లు. అంటే 36 శాతం పెరిగింది. H1 FY24లో 113.5 కోట్లు. కంపెనీ నిర్వహణ EBITDA (వడ్డీ, పన్నులు, తరుగుదల, రుణ విమోచనకు ముందు ఆదాయాలు) రూ. 59.5 కోట్లు నుండి 19 శాతానికి పెరిగింది.
Q2 FY25లో టిప్స్ మ్యూజిక్ మొత్తం 125 కొత్త పాటలను ప్రారంభించింది. ఇందులో 39 కొత్త సినిమా పాటలు , 86 సినిమాయేతర పాటలు ఉన్నాయి. త్రైమాసికంలో కంటెంట్ ధర రూ. 13.8 కోట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగింది. Q2 FY24లో 4.7 కోట్లు... ఇది 194 శాతం పెరుగుదలను ప్రతిబింబిస్తుంది. టిప్స్ మ్యూజిక్ యూట్యూబ్ ఛానెల్ ఆకట్టుకునే సబ్‌స్క్రైబర్ వృద్ధిని అందుకుంది. 108 మిలియన్లకు ఇది చేరుకుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 21 శాతం పెరుగుదల. Q2 FY25కి కంపెనీ ఒక్కో షేరుకు రూ.2 చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది, మొత్తం రూ. 25.56 కోట్లు. మొత్తంగా, డివిడెండ్‌లు మరియు బైబ్యాక్ లు సహా షేర్‌హోల్డర్‌లకు టిప్స్ మ్యూజిక్ మొత్తం చెల్లింపు రూ. FY25లో ఇప్పటి వరకు 97.74 కోట్లు.
ప్రస్తుతం మా దృష్టి అధిక నాణ్యత గల మ్యూజిక్ కంటెంట్‌ను అందించడంపైనే ఉందని తౌరాణీ అన్నారు..
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరీష్ తౌరాని మాట్లాడుతూ ``2025 క్యూ2లో మేము 125 కొత్త పాటలను విజయవంతంగా ప్రారంభించాము. వాటిలో 39 కొత్త సినిమా పాటలు, 86 నాన్ ఫిల్మ్ పాటలు ఉన్నాయి. ఫలితంగా విస్తృతమైన ప్రేక్షకులకు వినోదం పంచాము. ఈ త్రైమాసికంలో మేము రెండు మ్యూజికల్ షార్ట్ ఫిల్మ్‌లను విడుదల చేసాము. తేడి మేడి -బెయింటెహా .. ఇవి రెండూ ప్రేక్షకుల నుండి గణనీయమైన ప్రశంసలను పొందాయి. ప్రఖ్యాత బి ప్రాక్ పాడిన ది బకింగ్‌హామ్ మర్డర్స్ చిత్రంలోని `యాద్ రెహ్ జాతీ హై` పాట, ఈ త్రైమాసికంలో విడుదలైన మరో పాట `దువా కిజియే` ప్రజాదరణ పొందాయి.. అని తెలిపారు.