Begin typing your search above and press return to search.

నాని - శ్రీకాంత్ ఓదెల.. టైటిల్ ఇదేనా?

ఇక టైటిల్ పై కూడా చర్చలు మొదలయ్యాయి. తాజాగా 'నాయుడిగారి తాలూకా' అనే టైటిల్ పై ఫోకస్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   16 Oct 2024 2:30 PM GMT
నాని - శ్రీకాంత్ ఓదెల.. టైటిల్ ఇదేనా?
X

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మరోసారి కలవబోతున్న విషయం తెలిసిందే. గత ఏడాది విడుదలైన 'దసరా' సినిమా ద్వారా నాని కెరీర్‌లో మరో బిగ్గెస్ట్ హిట్ సాధించగా, ఈ చిత్రంతో దర్శకుడిగా శ్రీకాంత్ ఓదెల అరంగేట్రం చేసి గుర్తింపు పొందాడు. ఇప్పుడు ఈ హిట్ కాంబో మళ్ళీ కలసి పని చేయబోతున్నారు. ఈ ప్రాజెక్ట్ గురించి ఎన్నో వార్తలు వైరల్ అవుతున్నాయి

ఈ కొత్త ప్రాజెక్ట్ కూడా మాస్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ లో ఉండబోతుందని సమాచారం. కథ నాణ్యత విషయంలో శ్రీకాంత్ ఓదెల ఎలాంటి సర్దుబాట్లకు తావులేకుండా మినహాయింపు లేకుండా ప్రీప్రొడక్షన్ పని జరుపుతున్నాడు. కథ రచన కోసం చాలా కాలంగా కష్టపడుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ పూర్తవగా, ప్రీప్రొడక్షన్ కూడా ముగిసినట్లు సమాచారం.

ఇక టైటిల్ పై కూడా చర్చలు మొదలయ్యాయి. తాజాగా 'నాయుడిగారి తాలూకా' అనే టైటిల్ పై ఫోకస్ పెంచినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఇది ఇంకా ఫిక్స్ కాలేదని తెలుస్తోంది. సినిమా షూటింగ్ సగం పూర్తి అయిన తర్వాతే అధికారికంగా టైటిల్ పై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఈ టైటిల్ ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని పెంచుతోంది.

దసరా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి భారీ బడ్జెట్ కేటాయించారు. దసరా విజయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ఇంకా గ్రాండ్ గా సినిమాను తెరకెక్కించడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమా కోసం 100 కోట్లకుపైగా బడ్జెట్ కేటాయించారని సమాచారం.

ఇక షూటింగ్ సగం పూర్తయిన తర్వాతే టైటిల్ విషయంలో మరియు ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరింత వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. నాని ఈ సినిమాలో కొత్త లుక్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా కథాంశం మాస్ ఆడియన్స్‌కి దగ్గరగా ఉండేలా ఉండబోతోందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.

సినిమా కోసం టెక్నీషియన్ జాబితా కూడా చాలా ఆసక్తికరంగా ఉండనుంది. టాప్ సౌత్ ఇండియన్ టెక్నీషియన్స్ ఈ చిత్రంలో పనిచేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా, సంగీత దర్శకుడిగా అనిరుధ్ రవిచందర్ ఎంపిక కూడా జరిగిపోయింది. అనిరుధ్ సంగీతం ఈ సినిమాలో మరో పెద్ద ప్లస్ అవుతుందని చిత్రబృందం నమ్మకంగా ఉంది.