Begin typing your search above and press return to search.

బిర్యానీ వ‌డ్డించిన డైరెక్ట‌ర్ ఎంత స్పెష‌ల్ అంటే!

`జైభీమ్`, `వెట్టేయాన్` విజ‌యాల‌తో ద‌ర్శ‌కుడు టి.జె. జ్ఞాన్ వేల్ మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు.

By:  Tupaki Desk   |   21 Oct 2024 10:30 PM GMT
బిర్యానీ వ‌డ్డించిన డైరెక్ట‌ర్ ఎంత స్పెష‌ల్ అంటే!
X

`జైభీమ్`, `వెట్టేయాన్` విజ‌యాల‌తో ద‌ర్శ‌కుడు టి.జె. జ్ఞాన్ వేల్ మ‌రింత ఫేమ‌స్ అయ్యాడు. రెండు సినిమాలు అత‌డికి ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. వెట్టేయాన్ డివైడ్ టాక్ తెచ్చుకున్నా? జ్ఞాన్ వేల్ ఎత్తుకున్న స్టోరీ పాయింట్ కి చాలా మంది క‌నెక్ట్ అయ్యారు. తాజాగా వెట్టేయాన్ చిత్రం బృందం థాంక్స్ గివింగ్ మీట్ ని చెన్నైలో ఏర్పాటు చేసింది. ఈ సంద‌ర్భంగా అక్క‌డో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం చోటు చేసుకుంది.

జ్ఞాన్ వేల్ స్వ‌యంగా చిత్ర బృందానికి త‌న స్వ‌హాస్తాల‌తో వ‌డ్డించాడు. అలాగే మీడియా ప్ర‌తినిధుల‌కు కూడా తానే స్వ‌యంగా వ‌డ్డించి అక్క‌డ జ‌ర్నలిస్టుల పాలిట ప‌క్ష‌పాతి అనిపించాడు. డైరెక్ట‌ర్ కాక‌ముందు జ్ఞాన్ వేల్ జ‌ర్న‌లిస్ట్ గా ప‌నిచేసారు. జ‌ర్న‌లిజంలో అపార అనుభ‌వం ఉంది. సామాజిక అంశాల‌పై ఎంతో అవ‌గాహ‌న‌, ఆస‌క్తి, అభిరుచి ఉన్న పాత్రికేయుడు ఆయ‌న‌. వె ట్టేయాన్ అవ‌కాశం రావ‌డం వెనుక కూడా ఆజ‌ర్న‌లిజం ప్ర‌ధానం కార‌ణం.

ర‌జ‌నీకాంత్ తాను జ‌ర్న‌లిస్ట్ అన్న విష‌యాన్ని తెల‌సుకుని అవ‌కాశం ఇచ్చిన‌ట్లు ఓ సంద‌ర్భంలో అన్నారు. `జైభీమ్` సినిమా తీసిన విధానం కూడా తోడవ్వ‌డంతో ర‌జ‌నీకాంత్ మ‌రో ఆలోచ‌న లేకుండా ఛాన్స్ ఇచ్చారు. స‌క్సెస్ అయిన ఓ జ‌ర్న‌లిస్ట్ ఇలా స్వ‌యంగా తోటి జ‌ర్న‌లిస్ట్ ల‌కు స్వ‌యంగా వ‌డ్డించ‌డం అక్క‌డ చ‌ర్చ‌నీయాంశంగా మారింది. జ్ఞాన్ వేల్ కోట్ల రూపాయ‌ల పారితోషికం తీసుకునే డైరెక్ట‌ర్ గా ఎదిగిన జ‌ర్న‌లిస్టుల‌కు తాను ఇచ్చిన గౌర‌వ, మర్యాద ల‌పై కోలీవుడ్ మీడియాలో హైలైట్ అవుతుంది.

జ్ఞాన్ వేల్ వ్య‌క్తిత్వాన్ని హైలైట్ చేస్తూ ప్ర‌త్యేక‌మైన క‌థ‌నాలు ప్ర‌చురిస్తుంది. ఇక జ్ఞాన్ వేల్ త‌దుప‌రి ఏ సినిమా చేస్తాడు? అన్న‌ది చూడాలి. ఇంత‌వ‌ర‌కూ ఏ హీరోతోనూ సినిమా ప్ర‌క‌టించ‌లేదు. కోలీవుడ్ హీరోలు కూడా ఎవ‌రి సినిమాల‌తో వారు బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. కొత్త ప్రాజెక్ట్ వివ‌రాలు కొత్త ఏడాదిలో చెబుతాడేమో చూడాలి.