Begin typing your search above and press return to search.

టైగర్ నాగేశ్వరరావు.. సమస్య తీరినట్లే..

అయితే సినిమాకు ఇంత రన్ టైమ్​ ఉండదాన్ని మొదట మూవీటీమ్​లోని ఇతర సభ్యులు అంగీకరించలేదని, ఈ విషయంలో ఈ చిత్ర దర్శకుడు వంశీతో మనస్ఫర్థలు వచ్చాయని ప్రచారం సాగింది.

By:  Tupaki Desk   |   18 Oct 2023 12:51 PM GMT
టైగర్ నాగేశ్వరరావు.. సమస్య తీరినట్లే..
X

దసరా బరిలో నిలిచిన మూడు చిత్రాల్లో పెద్ద సినిమా టైగర్ నాగేశ్వరరావు మాత్రమే. ఈ చిత్రం 3 గంటల 5 నిమిషాల నిడివితో వస్తోంది. మరి దసరా బరిలో ఇంత పెద్ద సినిమాను జనాలు కుర్చిలో కూర్చొని కదలకుండా చూడగలరా? అంటే కచ్చితంగా చూస్తారని అన్నారు నిర్మాత అభిషేక్ అగర్వాల్.

అయితే సినిమాకు ఇంత రన్ టైమ్​ ఉండదాన్ని మొదట మూవీటీమ్​లోని ఇతర సభ్యులు అంగీకరించలేదని, ఈ విషయంలో ఈ చిత్ర దర్శకుడు వంశీతో మనస్ఫర్థలు వచ్చాయని ప్రచారం సాగింది. కానీ చివరికి దర్శకుడు వంశీ పట్టుబట్టి మరీ నిడివి ఎక్కువ ఉండేలా ఏకపక్ష నిర్ణయం తీసుకుని ఉంచారని కథనాలు వచ్చాయి.

తాజాగా ఈ విషయాన్ని ఖండించారు అభిషేక్ అగర్వాల్. కథ ప్రాముఖ్యత బట్టే నిడివి ఎక్కువ సేపు ఉంచారని క్లారిటీ ఇచ్చారు. టీమ్ మొత్తం కలిసి చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. దర్శకుడు వంశీ ఒక్కడే తుది నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఎటువంటి విభేదాలు రాలేదని స్పష్టత ఇచ్చారు.

"మేమంతా కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకున్నాం. సినిమా చూసిన తర్వాత లాంగ్ రన్ టైమ్​ కథకు సరిపోతుందనే అనిపించింది. టీమ్​ అందరం కలిసి ఈ నిర్ణయాన్ని ఓకే చేశాం. అంతే తప్ప దర్శకుడు ఒక్కడే తీసుకోలేదు. మీరు సినిమా చూస్తే.. కచ్చిగా ఇంత నిడివి ఉండటానికి గల కారణాన్ని అర్థం చేసుకుంటారు" అని అభిషేక్ చెప్పారు. ఇదే విషయమై దర్శకుడు వంశీ కూడా మాట్లాడుతూ.. సినిమా చూసిన తర్వాత మరో 10 నిముషాలుంటే బావుండేదని అన్న ఫీలింగ్ కలుగుతుందని అన్నారు.

ఇకపోతే ఎవరి మీదైనా బయోపిక్ సినిమా తీస్తున్నప్పుడు.. ఆ వ్యక్తి కుటుంబం నుంచి లీగల్​గా సమస్యలు కూడా ఎదురొవ్వచ్చు. అయితే పబ్లిక్ డొమైన్​లో ఉన్న వ్యక్తుల కథలు.. 60ఏళ్లు దాటితే దాని కోసం ఎటువంటి లీగల్​ అప్రూవల్స్​ అవసరం ఉండదు. ఇతర కథలకైతే కావాలి. అందుకే ముందుగా టైగర్ నాగేశ్వరరావు విషయంలో.. ఆయన భార్య పిల్లల నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ తీసుకున్నట్లు తెలిపారు అభిషేక్. నాగేశ్వరరావు జైలు జీవితం గురించి అఫీషియల్​ డొమైనలో సమాచారం తీసుకున్నారని, ఇక పర్సనల్ లైఫ్​ గురించి అతడి భార్య, పిల్లల దగ్గర నుంచి సమాచారం సేకరించినట్లు వెల్లడించారు. కాకపోతే సినిమాకు కాస్త కమర్షియల్ టచ్​ ఇచ్చినట్లు క్లారిటీ చేశారు.