Begin typing your search above and press return to search.

టైగ‌ర్ ని ఢీకొట్టే విల‌న్ అత‌నే!

ఇందులో జిషు సేన్ గుప్తా విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసారు. న‌టుడిగా మ‌రో స్థాయికి తీసుకెళ్లే చిత్ర‌మిది.

By:  Tupaki Desk   |   8 Aug 2023 5:30 PM GMT
టైగ‌ర్ ని ఢీకొట్టే విల‌న్ అత‌నే!
X

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా వంశీకృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో 'టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు' తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. 70 కాలం నాటి పేరు మోసిన గ‌జ దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్క‌డంతో సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. వాస్త‌వ క‌థ‌ల్ని ప‌ర్పెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల్గితే అవి బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నాలే సృష్టించాయి. ఈ నేప‌థ్యంలోనే గ‌జ‌దొంగ పాత్ర‌కి మాస్ రాజా ప్ర‌త్యేకంగా స‌న్న‌ద‌మ‌య్యారు. ఇందులో ఓ కొత్త లుక్ లోనూ క‌నిపించ‌నున్నారు.

పాన్ ఇండియాలో సినిమా ని రిలీజ్ చేస్తున్నారు. ఇందులో ర‌వితేజ కి జోడీగా నూప‌ర్ స‌న‌న్..గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్ న‌టిస్తున్నారు. మ‌రి రాజాని ఢీ కొట్టే ప్ర‌తినాయ‌కుడి పాత్ర ఎవ‌రు పోషిస్తున్నారు? అంటే ఇంత కాలం స‌స్పెన్స్ ఉన్నా? ఇప్పుడా గుట్టు వీడింది. ఇందులో జిషు సేన్ గుప్తా విల‌న్ గా న‌టిస్తున్న‌ట్లు ఆయ‌నే స్వ‌యంగా రివీల్ చేసారు. న‌టుడిగా మ‌రో స్థాయికి తీసుకెళ్లే చిత్ర‌మిది. మునుపెన్న‌డు చూడ‌ని కొత్త అవ‌తారం క‌నిపిస్తాడ‌ని తెలిపారు. దీన్ని బ‌ట్టి జిషు పాత్ర కూడా ర‌గ‌డ్ గా ఉంటుందో చెప్పొచ్చు.

ఇప్ప‌టివ‌ర‌కూ జీషూ సేన్ గుప్తా చాలా తెలుగు సినిమాల్లో విల‌న్ గా న‌టించారు. అందులో ఉగ్ర‌వాద మూలాలు ఉన్న పాత్ర‌లు ఎక్కువ‌గా పోషించారు. అవి ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌మైన గుర్తింపును తీసుకొచ్చాయి. కొన్ని వైవిథ్యమైన పాత్ర‌లు ఆయ‌న్ని టాలీవుడ్ లో ఫోక‌స్ట్ గా చేసాయి. అయితే నాగేశ్వ‌ర‌రావు లో రోల్ మాత్రం గ‌త చిత్రాల‌న్నింకంటే భిన్నంగా ఉంటుంద‌ని తెలుస్తోంది.

వాస్త‌వ సంఘ‌ట‌న‌లు ఆధారంగా 70 బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతోన్న సినిమా కాబ‌ట్టి అప్ప‌టి విల‌న్లు ఎలా ఉండేవారు? వాళ్ల ఆహార్యంలో క‌నిపించే అవ‌కాశం ఉంది. సినిమాలో ప్ర‌తీ పాత్ర అలాగే క‌నిపిస్తుంది. ఈ సినిమాతో పాటు జిషు సేన్ గుప్తా ప‌లు సినిమాలు చేస్తున్నాడు. బెంగాలీ..త‌మిళ సినిమా ఛాన్సులు అందుకుంటున్నాడు. బెంగాలీ న‌టుడైన జిషు సేన్ గుప్తా ప‌లు ఇంగ్లీష్..హిందీ సినిమాలు చేసాడు.