సంక్రాంతి ఫైట్ మరింత టఫ్..!
ఐతే ఎప్పటిలానే 2025 సంక్రాంతి కూడా బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది.
By: Tupaki Desk | 14 Dec 2024 12:30 PM GMTసంక్రాంతి అంటేనే కొత్త పంట ఇంటికి వచ్చి సంతోషంగా ఉండటమే కాదు తెర మీద స్టార్ సినిమాల పండగ కూడా అని తెలుగు ఆడియన్స్ ఫిక్స్ అయ్యారు. అందుకే ప్రతి పొంగల్ కి స్టార్ సినిమాలు వరుస బెట్టి రిలీజ్ చేస్తారు. ఈ సీజన్ లో రెండు మూడు కాదు నాలుగు సినిమాలు వచ్చినా చూసే ఛాన్స్ ఉంటుంది. మాస్, క్లాస్, యాక్షన్స్, ఎంటర్టైనర్ ఇలా అన్ని జోనర్ సినిమాలు ఈ సీజన్ లో వచ్చి సక్సెస్ అయ్యాయి. ఐతే ఎప్పటిలానే 2025 సంక్రాంతి కూడా బాక్సాఫీస్ దగ్గర ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతుంది.
ముందు సంక్రాంతికి రిలీజ్ అని అనౌన్స్ చేసిన మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర వాయిదా పడగా రేసులో గ్లోబల్ స్టార్ రాం చరణ్ గేమ్ ఛేంజర్ వచ్చి చేరింది. శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా మీద అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. ఇక సంక్రాంతికి బాలయ్య సినిమా వస్తే ఆ హంగామా వేరేలా ఉంటుంది. బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమా కూడా సంక్రాంతికి మాస్ యాక్షన్ సినిమాగా వస్తుంది.
ఈ సినిమాతో పాటు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వస్తుంది. ఐతే మొన్నటిదాకా ఈ 3 సినిమాల మధ్యే సంక్రాంతి ఫైట్ ఉంటుందని అనుకోగా సంక్రాంతికి ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ సినిమా వచ్చి చేరబోతుంది. సంక్రాంతి బరిలో నితిన్ రాబిన్ హుడ్ కూడా వస్తుందని టాక్. అసలైతే ఈ సినిమాను డిసెంబర్ 20న రిలీజ్ అనుకున్నారు. ఆ తర్వాత డిసెంబర్ 25న క్రిస్మస్ కి రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు మేకర్స్ సంక్రాంతికి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నారట.
సో నితిన్ రాబిన్ హుడ్ కూడా పొంగల్ రేసులో ఉండబోతుంది. భీష్మతో హిట్ కొట్టిన డైరెక్టర్ తో నితిన్ చేస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా కూడా ఎంటర్టైనర్ గా రాబోతుంది. మరి సంక్రాంతి రేసులో ఊహించని విధంగా రిలీజ్ ప్లాన్ చేసిన నితిన్ సినిమా తో ఈ సినిమాలన్నిటి మధ్య భారీ ఫైట్ ఉండేలా ఉంది. 10న గేమ్ ఛేంజర్, 12న డాకు మహారాజ్, 14న సంక్రాంతికి వస్తున్నాం రిలీజ్ లాక్ చేసుకోగా 13న రాబిన్ హుడ్ వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.