నటుడికి టోకరా...45 లక్షలు గోవిందా!
తాజాగా ఓ టాలీవుడ్ హీరో 45 లక్షలు పొగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూ ట్యూబ్ లో టాస్క్ లు పూర్తి చేస్తే 45 లక్షలు వస్తాయని నమ్మబలికారు.
By: Tupaki Desk | 14 Sep 2024 7:40 AM GMTమోసపోయే వాడు ఉన్నంత కాలం మోసం చేసే వాళ్లు ఉంటూనే ఉంటారు? అని ఓ సినిమాలో డైలాగ్ ఉంది. ఇది అచ్చంగా నిజమే అని ఇప్పటికీ ప్రూవ్ అవుతనే ఉంది. సైబర్ నేరగాళ్ల తో జాగ్రత్త అని నెత్తి నోరు మొత్తుకున్నా? నిత్యం డబ్బులు పోగొట్టుకున్న బాధితుల సంఖ్య నమోదవుతూనే ఉంది. ఆన్ లైన్ మోసాలు అంతకంతకు రెట్టింపు అవుతూనే ఉన్నాయి. ఒక రూపం కాకపోతే దానికి మరో రూపం తగిలించి మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు.
మోసపోవడానికి చదువుతో పనిలేదు. ఇంకా చెప్పాలంటే చదువులేని వాడి కంటే చదువు అన్ని తెలిసిన వాడే ఎక్కువగా మోస పోతున్న జాబితాలో కనిపిస్తున్నాడు. తాజాగా ఓ టాలీవుడ్ హీరో 45 లక్షలు పొగొట్టుకున్న ఉదంతం వెలుగులోకి వచ్చింది. యూ ట్యూబ్ లో టాస్క్ లు పూర్తి చేస్తే 45 లక్షలు వస్తాయని నమ్మబలికారు. అప్పటికే కొన్ని టాస్క్ లు పూర్తి చేయంతో వాళ్ల నుంచి కొంత అమౌంట్ రిటర్న్ కూడా వచ్చింది.
దీంతో మరిన్ని టాస్క్ లు పూర్తి చేస్తే ఇంకా డబ్బు వస్తుందని ఆశపడ్డాడు. ఆ ఆశతోనే మోసగాళ్లు నెత్తిన శట గొపం పెట్టారు. తెలివిగా 45 లక్షలు పెట్టిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. తర్వాత మెల్లగా హీరోకి మ్యాటర్ అర్దమైంది. ఇంకేముంది అప్పటికే చేతులు కాలిపోయాయి. ఇక ఆకలు పట్టుకుంటే లాభమేమి. చేసేదేం లేక సైబర్ క్రైమ్ ని ఆశ్రయించి కేసు ఫైల్ చేసాడు. ఇలాంటి కేసులు ఎన్నో ఉన్నాయి.
రోజు ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. కేసు నంబర్లు నమోదవుతూనే ఉన్నాయి. కానీ వాటికి పరిష్కారం మాత్రం అంత సులభంగా దొరకడం లేదు. ఇంతకీ ఎవరా నటుడు అంటే? అతడి పేరు భిష్ణు అధికారి.' హిట్ మ్యాన్' సినిమా చేసాడు. 99 సినిమాస్ పతాకంపై ఈ సినిమా రూపొందింది. ఇందులో అదితి శర్మ, అంచల్ శర్మ హీరోయిన్లగా గా నటించారు.