Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : పెంకుటిల్లు ఎక్కిన హీరోయిన్‌

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నార్త్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌.

By:  Tupaki Desk   |   20 Feb 2025 9:38 AM GMT
పిక్‌టాక్ : పెంకుటిల్లు ఎక్కిన హీరోయిన్‌
X

'మనసుకు నచ్చింది' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నార్త్‌ బ్యూటీ అమైరా దస్తూర్‌. ఇండస్ట్రీలో అడుగు పెట్టి దశాబ్ద కాలం దాటినా ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కించుకోలేక పోయింది. అయితే సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు షేర్‌ చేస్తున్న అందమైన ఫోటోల కారణంగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. బాలీవుడ్‌లో 2013లో సినీ కెరీర్‌ను ప్రారంభించిన ఈ అమ్మడు ఆ తర్వాత టాలీవుడ్లో మనసుకు నచ్చింది, రాజుగాడు సినిమాల్లో నటించింది. ఆ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశ పరిచాయి. దాంతో టాలీవుడ్‌లో పెద్దగా ఆఫర్లు సొంతం చేసుకోలేక పోయింది. కానీ హిందీలో మాత్రం ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేసే అవకాశాలు దక్కించుకుంది.


ఇసాక్ సినిమాతో బాలీవుడ్‌లో పరిచయం అయిన అమైరా దస్తూర్‌ ఆ తర్వాత మిస్టర్ ఎక్స్ సినిమాలో నటించింది. కాలకండి, రాజ్మా చావల్‌, జడ్జిమెంటల్‌ హై క్యా, ప్రస్థానం, కోయి జానేనా సినిమాల్లో హీరోయిన్‌గానే కాకుండా కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ నటించింది. పలు సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈమెకు మాత్రం గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ఈ అమ్మడిని లైట్ తీసుకున్నారు. ఎన్నో సినిమాల్లో తన అందంతో అలరించిన అమైరా సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా పెంకుటిల్లు ఎక్కడం ద్వారా వార్తల్లో నిలిచింది.


ఫోటో షూట్‌ కోసం అమైరా దస్తూర్‌ ఏకంగా పెంకుటిల్లు ఎక్కింది. లోయర్ యాంగిల్‌లో అమైరా దస్తూర్ ఫోటోలను క్లిక్‌ చేశారు. ఈ స్థాయి అందం కేవలం ఈ అమ్మడికే సాధ్యం అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే, వావ్‌ ఈమె అందానికి ఫిదా అయ్యాం అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. గతంలో ఎన్నో సార్లు ఆకట్టుకునే అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేసిన అమైరా దస్తూర్‌ ఈసారి మరింత విభిన్నంగా ఉందంటూ నెటిజన్స్ ఈ ఫోటోలను తెగ లైక్ చేసి కామెంట్‌ చేస్తున్నారు.


వైట్‌ డ్రెస్‌లో ఇంతటి అందంగా ఉన్న అమైరా దస్తూర్‌ను ఎందుకు ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవడం లేదు... ఈమె అందంకు, ప్రతిభకు తగ్గట్లుగా ఎందుకు ఆఫర్లు రావడం లేదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు ముందు అయినా ముద్దుగుమ్మ అమైరా దస్తూర్‌కి మంచి సినిమాల్లో ఆఫర్లు రావాలని, సినిమాల్లో కాకున్నా వెబ్‌ సిరీస్‌ల్లో అయినా ఈ అమ్మడు నటించాలని నెటిజన్స్‌, ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఇంత అందంగా ఉన్న అమైరా దస్తూర్‌ మరో పదేళ్ల పాటు ఇండస్ట్రీ ఉండేందుకు అర్హురాలు అంటూ ఈ ఫోటోలకు కొందరు కామెంట్ చేస్తున్నారు.