పిక్‌టాక్ : కవ్వించే చూపులతో ముద్దుగుమ్మ
'మనసుకు నచ్చింది' సినిమాతో అమైరా దస్తూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా నిరాశ పరచడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు.
By: Tupaki Desk | 27 Feb 2025 5:00 PM IST'మనసుకు నచ్చింది' సినిమాతో అమైరా దస్తూర్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. ఆ సినిమా నిరాశ పరచడంతో తెలుగులో పెద్దగా ఆఫర్లు రాలేదు. రాజ్ తరుణ్ తో కలిసి రాజుగాడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమైరాకి ఆ సినిమా నిరాశను మిగిల్చింది. రాజు గాడు సినిమా తర్వాత తెలుగులో ఈ అమ్మడు పెద్దగా కనిపించలేదు. కానీ హిందీ, తమిళ్ సినిమాల్లో ఈమెకు అడపా దడపా ఆఫర్లు వస్తున్నాయి. హిందీలో ఈ అమ్మడు ప్రస్థానం, జడ్జిమెంటల్ హై క్యా, కోయి జానే నా, జోగి, ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ సినిమాల్లో నటించింది. అవేవి ఈ అమ్మడికి స్టార్‌డంను తెచ్చి పెట్టలేక పోయాయి.
గత సంవత్సరం ఫుర్టీలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోవడంతో మళ్లీ ఆఫర్ల కోసం ఈ అమ్మడు ప్రయత్నాలు చేయాల్సిన పరిస్థితి. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అయిన బంబై మేరీ జాన్ సిరీస్‌లో ఈమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ఒకటి రెండు వెబ్ సిరీస్‌ల్లో ఆఫర్లు వచ్చినా వాటికి అమైరా ఓకే చెప్పలేదు. హీరోయిన్‌గా మాత్రమే సినిమాను చేయాలని ఈ అమ్మడు ఆశ పడింది. కానీ హీరోయిన్‌గా ఈ అమ్మడికి ఆఫర్లు దక్కడం లేదు. కానీ సోషల్ మీడియా ద్వారా ఇలాంటి అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేయడం ద్వారా వార్తల్లో ఉంటుంది.
ఇన్‌స్టాగ్రామ్‌లో స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో అందాల ఆరబోత ఫోటోలను షేర్ చేసే అమైరా దస్తూర్ కి దాదాపుగా 3.5 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. వెండి తెరపై అందాల ఆరబోత చేసే అవకాశం దక్కక పోయినా ఇలా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తన అందాల ఆరబోత ఫోటోలను అమైరా దస్తూర్ రెగ్యులర్‌గా షేర్ చేస్తూనే ఉంటుంది. తాజాగా మరోసారి ఈ అమ్మడు ఈ ఫోటోలతో కన్నుల విందు చేసింది. కవ్వించే విధంగా చూస్తూ ముద్దుగుమ్మ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందం ఉన్నా సినిమాల్లో అమైరాకి రావాల్సిన ఆఫర్లు రాలేదు, దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
గతంలో స్పెషల్ సాంగ్‌లో నటించిన అమైరా దస్తూర్ మరోసారి అలాంటి ప్రత్యేక పాటలకు, ప్రత్యేక పాత్రలకు ఓకే చెబుతోంది. ఆకట్టుకునే అందం, మంచి ఫిజిక్ ఉండటంతో పాటు నటిగా మంచి ప్రతిభ ఉన్న అమైరా దస్తూర్ ముందు ముందు అయినా సినిమాల్లో మంచి ఆఫర్లు దక్కించుకుంటుందేమో చూడాలి. హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగానూ అమైరా దస్తూర్ నటించేందుకు ఓకే చెబుతుంది. కనుక బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ ఈ అమ్మడు ముందు ముందు బిజీ అయ్యేనా చూడాలి.