Begin typing your search above and press return to search.

పిక్‌టాక్‌ : చీర కట్టులో నా సామిరంగ..!

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్‌ క్రేజీ బాయ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది.

By:  Tupaki Desk   |   9 Dec 2024 6:30 PM GMT
పిక్‌టాక్‌ : చీర కట్టులో నా సామిరంగ..!
X

కన్నడ ముద్దుగుమ్మ ఆషికా రంగనాథ్‌ క్రేజీ బాయ్ సినిమాతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. కన్నడ సినిమాల్లో ఎక్కువగా నటించిన ఈ అమ్మడు తమిళ్‌లో మొదటి సారి పట్టతు ఆసరన్‌లో నటించింది. 2022లో వచ్చిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. కన్నడంలో దక్కిన స్టార్‌డం నేపథ్యంలో తమిళ్‌, తెలుగు సినిమా ఇండస్ట్రీల్లో ఆఫర్లు వచ్చాయి. తెలుగులో ఈ అమ్మడు ఎంట్రీ ఇచ్చిన సమయంలో మంచి హీరోయిన్‌గా పేరు దక్కించుకుంటుందని, వరుసగా ఆఫర్లు సొంతం చేసుకుంటుంది అంటూ అంతా భావించారు.


తెలుగులో ఈఅమ్మడు నటించిన నాగార్జున 'నా సామిరంగ' సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌ అయ్యింది. అందుకే ఈ అమ్మడు మళ్లీ టాలీవుడ్‌లో కనిపించడం లేదు. కొన్ని సినిమా ఆఫర్లు వచ్చినా చిన్నా చితకా అనే ఉద్దేశ్యంతో తిరస్కరించిందని సమాచారం అందుతోంది. స్టార్‌ హీరో సినిమాలో ఛాన్స్ కోసం ఆషికా ఎదురు చూస్తుంది. ప్రస్తుతం ఇతర భాషల్లో రెగ్యులర్‌గా సినిమాలు చేస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో అందాల ఆరబోత ఫోటోలతో పిచ్చెక్కిస్తోంది. ఇటీవల ఈ అమ్మడు షేర్‌ చేసిన సముద్రంపై షికారు ఫోటోలు, వీడియోలు వైరల్‌ అయ్యాయి.


ఇప్పుడు చీర కట్టులో ఈ అమ్మడి యొక్క ఫోటో షూట్‌ చూపు తిప్పుకోనివ్వడం లేదు. ఈ స్థాయి అందం ఆషికాకే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు తెర తీసే విధంగా ఈ అమ్మడి యొక్క చీర కట్టు ఫోటోలు ఉన్నాయి. చీర కట్టులో నడుము నాభి అందం చూపిస్తే ఆ ఫోటోలు వైరల్‌ అవుతాయి. కానీ ఆషికా నడుము కనిపించకుండానే, నాభి చూపించకుండానే వైరల్‌ అవుతోంది. కలర్‌ఫుల్‌ చీర కట్టుతో ఈ అమ్మడు ఓ రేంజ్‌లో ఆకట్టుకుంది. అన్ని వర్గాల వారిని మెప్పించే విధంగా ఈమె అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు.

తెలుగులో మొదటి సినిమా నిరాశ పరచడంతో కనిపించకుండా పోయిన ఆషికా రంగనాథ్‌ను ప్రేక్షకులు మళ్లీ చూడాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా తెలుగులో ఈమెకు యంగ్‌ స్టార్‌ హీరోల సరసన ఆఫర్లు వస్తే చూడాలని, ఆమె ప్రతిభ, అందం ఆ సినిమాల్లో చూడాలని ఆశ పడుతున్న వారు చాలా మంది ఉన్నారు. ప్రస్తుతానికి కన్నడం, తమిళ్‌ సినిమాల్లో మాత్రమే నటిస్తున్న ఈ అమ్మడు ముందు ముందు మరిన్ని సినిమాలు చేస్తుందేమో చూడాలి.