Begin typing your search above and press return to search.

పిక్ టాక్ : క్యూట్‌ అవికా స్టన్నింగ్‌ లుక్స్‌

బాలికా వధు సీరియల్ దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది.

By:  Tupaki Desk   |   23 Sep 2024 11:30 AM GMT
పిక్ టాక్ : క్యూట్‌ అవికా స్టన్నింగ్‌ లుక్స్‌
X

బాలికా వధు సీరియల్ దేశవ్యాప్తంగా బాగా పాపులారిటీ సొంతం చేసుకుంది. తెలుగు లో చిన్నారి పెళ్లి కూతురు గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సీరియల్‌ తో అవికా చిన్న పాప గా పరిచయం అయింది. ఆ సీరియల్‌ తో వచ్చిన గుర్తింపు కారణంగా టాలీవుడ్‌ లో ఉయ్యాల జంపాల సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాలోనే నటిగా మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. పైగా ఆ సినిమా కమర్షియల్‌ విజయాన్ని సొంతం చేసుకున్న కారణంగా వరుసగా ఆఫర్లు వచ్చాయి. హీరోయిన్‌ గా అవికా కి టాలీవుడ్‌ లో మంచి గుర్తింపు దక్కి పలు సినిమాల్లో నటించే అవకాశం దక్కింది.


కొన్ని కారణాల వల్ల అవికా తక్కువ సమయంలోనే కనిపించకుండా పోయింది. అయితే కాస్త గ్యాప్‌ తర్వాత అవికా బౌన్స్ బ్యాక్ అయింది. బరువు పెరిగిన అవికా గ్యాప్‌ లో చాలా బరువు తగ్గి అందరినీ ఆశ్చర్యపరిచింది. రీ ఎంట్రీ లో కుమ్మేస్తాను అనుకున్న అవికా కి నిరాశ మిగిలింది. ఎక్కువ సినిమా ల్లో నటించే అవకాశాలు రాలేదు. తెలుగు లో ఆఫర్లు ఎక్కువ రాకపోవడంతో ఇతర భాషల్లోనూ ప్రయత్నాలు చేసింది. ఇటీవల ఈమె బ్రదర్‌ సినిమాలో నటించి మెప్పించింది. హీరోయిన్‌ గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా సైతం నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇటీవల చెప్పుకొచ్చింది.


సోషల్‌ మీడియాలో రెగ్యులర్ గా తన అందమైన ఫోటోలను అవికా గోర్‌ షేర్ చేయడం మనం చూస్తూ ఉంటాం. తాజాగా బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలు షేర్ చేసి మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. సాధారణంగా బ్లాక్ అండ్‌ వైట్‌ ఫోటోలు ఎక్కువ మందికి నచ్చవు. కానీ అవికా బ్లాక్ అండ్‌ వైట్‌ లో కనిపించినా వావ్ అనిపించేంత అందంగా ఉంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ స్థాయి అందం కేవలం అవికా కే సాధ్యం అన్నట్లుగా నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో అవికా అందాల ఫోటోలు చూసి వావ్ స్టన్నింగ్‌ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇలాంటి ఫోటో షూట్స్ వల్ల ముందు ముందు మరిన్ని సినిమాల్లో నటించే అవకాశాలు ఈ అమ్మడికి దక్కవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ ఈ అమ్మడి సొంతం అంటూ ఈ ఫోటోలు చూసిన నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. కెరీర్‌ ఆరంభంలో ఎంత అందంగా అయితే కనిపించిందో ఇప్పుడు అదే అందంతో, క్యూట్‌ గా స్టన్నింగ్‌ లుక్ లో అవికా కనిపిస్తోంది. వయసు పెరిగినా ఇంకా రెండు పదుల వయసుకు చేరువ అయిందా అనే అనుమానం కలిగేంత అందం ఈ అమ్మడి సొంతం అనడంలో సందేహం లేదు.