దేవియాని.. బికినీ కంటే చీరలోనే మరింత అందంగా..
సోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యే హీరోయిన్స్ సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది.
By: Tupaki Desk | 5 Sep 2024 5:57 AM GMTసోషల్ మీడియా ద్వారా ఫేమస్ అయ్యే హీరోయిన్స్ సంఖ్య రోజురోజుకు మరింత పెరుగుతోంది. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా బ్యూటీస్ తమ టాలెంట్ చూపుతూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. సినిమా అవకాశాల కోసం కూడా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య కీలకంగా మారాయి. పలు నార్త్ హీరోయిన్స్ ఈ విధంగా పెద్దపెద్ద అవకాశాలు దక్కించుకుంటున్నారు. తెలుగులోనూ ఈ ట్రెండ్ బాగా కనిపిస్తోంది.
తెలుగు వెబ్ సిరీస్‌ల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న దేవయాని శర్మ, ఈ నేపథ్యంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. అనగనగా సిరీస్‌తో తెలుగు పరిశ్రమలోకి అడుగుపెట్టిన దేవయాని, భానుమతి & రామకృష్ణ చిత్రంలోనూ తన ప్రదర్శనతో ఆకట్టుకుంది. అయితే, ఆమెకు నిజమైన గుర్తింపు తెచ్చిన ప్రాజెక్ట్ మాత్రం సైతాన్ అనే క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో దేవయాని తన పాత్రతో ప్రేక్షకుల అభిమానం పొందింది.
ఆ తర్వాత సేవ్ ది టైగర్స్ అనే పాపులర్ సిరీస్ లో చైతన్య కృష్ణ భార్యగా నటించి, ఆమె నటనకు మంచి ప్రశంసలు అందుకున్నది. రెండో సీజన్ కూడా మంచి హిట్ అయింది. ఈ రెండు ప్రాజెక్ట్స్ తర్వాత ఆమె మరో ప్రాముఖ్యత కలిగిన పాత్రను ఝాన్సీ సిరీస్‌లో కూడా పోషించింది. వెబ్ సిరీస్‌లలో బిజీగా ఉన్నప్పటికీ, దేవయాని సినిమాల్లో కూడా అవకాశాలను వెతుకుతోంది.
ఇక సోషల్ మీడియాలోనూ దేవయాని చాలా యాక్టివ్ గా ఉంటుంది. తరచుగా తన ఫోటోలతో అభిమానులను అలరిస్తుంటుంది. గతంలో బికినీలో కూడా స్టన్ అయ్యేలా కనిపించింది. ఇక ఆమె తాజా ఫోటోలు చాలా మంది నెటిజన్లను ఆకర్షించాయి. ఇందులో దేవయాని చీరకట్టులో సంప్రదాయ భారతీయ అందాన్ని చూపిస్తూ, తన ఫాలోవర్స్‌కు ప్రత్యేక సందేశం ఇచ్చింది.
నీలం రంగు చీరలో ఆమె తీసుకున్న ఫోటోలు, జుట్టు సింపుల్‌గా వదిలేయడం, నడుముకు చీర కొంగుని వేసిన విధానం చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. దేవయాని తన గ్లామర్ తో కాకుండా, సింప్లిసిటీతోనూ ఆకట్టుకోవడం ఆమె ప్రత్యేకత. ఇలాంటి సంప్రదాయ లుక్స్‌లోనూ స్టైలిష్‌గా కనిపించడం చాలా అరుదు. నేటి తరం హీరోయిన్స్‌లో ఇలాంటి విభిన్నమైన స్టైల్‌ను ప్రదర్శించడం ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తోంది.