దేవియాని శర్మ.. నీటిలో అలా గ్లామర్ బ్లాస్ట్
తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌లతో ప్రారంభించిన దేవియాని, తొలి అడుగుల నుంచే ప్రేక్షకులను తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకుంది.
By: Tupaki Desk | 3 Nov 2024 7:30 PM GMTతెలుగు వెబ్ సిరీస్‌లలో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్న దేవియాని శర్మ, ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోషూట్ ఫోటోలతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ ఫోటోలు ఆమె ఫాలోవర్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. స్మోకీ బ్రౌన్ కలర్ మినీ డ్రెస్‌లో నీటిలో నిలుచుని ఫోజులిస్తూ దేవియాని స్టైల్, గ్లామర్‌ను మరింతగా హైలైట్ చేసింది. "బ్లాస్ట్ ఫ్రమ్ ది పాస్ట్" అనే క్యాప్షన్‌తో ఈ ఫోటోలను పోస్ట్ చేస్తూ, గతంలో తీసుకున్న ఈ అద్భుతమైన ఫోటోషూట్‌ను గుర్తు చేసుకుంది.
తన కెరీర్‌ను వెబ్ సిరీస్‌లతో ప్రారంభించిన దేవియాని, తొలి అడుగుల నుంచే ప్రేక్షకులను తన వైవిధ్యభరితమైన పాత్రలతో ఆకట్టుకుంది. తెలుగు వెబ్ సిరీస్ ‘అనగనగా’లో తన నటనకు మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈ యాక్ట్రెస్, ఆ తర్వాత ‘సేవ్ ది టైగర్స్’ వంటి సిరీస్‌లో మోడ్రన్ హౌస్ వైఫ్‌గా మెప్పించింది.
అలాగే ‘సైతాన్’ వెబ్ సిరీస్‌లో వైలెంట్ పాత్రలో నటించి ప్రేక్షకులకు తన నటనలో ఉన్న పరిణితిని చూపించింది. ఈ సిరీస్‌లు ఆమెకు టాలీవుడ్ ప్రేక్షకుల మధ్య ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందించాయి. తాజాగా షేర్ చేసిన ఈ ఫోటోల్లో ఆమె లెగ్స్ అందాన్ని ఎలివేట్ చేస్తూ, తన బోల్డ్ స్టైల్‌ను ఫ్యాన్స్‌కు ప్రదర్శించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోషూట్లతో నిత్యం అభిమానులను అలరిస్తూ ఉండే దేవియాని, తన ప్రతి లుక్‌ను స్టైలిష్‌గా ప్రెజెంట్ చేస్తుంది.
ప్రస్తుతం ఆమెకు ఉన్న పాపులారిటీతో, భవిష్యత్తులో ఆమె కమర్షియల్ సిల్వర్ స్క్రీన్‌పై కూడా మెరవాలని ఆశిస్తోంది. ఇలాంటి హాట్ ఫోటోషూట్‌లతో దేవియాని శర్మ తన ఫాలోవర్స్‌ను పెంచుకుంటూ, గ్లామర్ ఇండస్ట్రీలో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఆమెకు బిగ్ స్క్రీన్ పై ఏమైనా అవకాశాలు అందుతాయో లేదో చూడాలి.