Begin typing your search above and press return to search.

అందాల దివి.. లెగ్స్ అందాలతో స్టన్నింగ్

సోష‌ల్‌మీడియాలో నిత్యం అప్‌డేట్స్ ఇస్తూ యూత్‌ను ఆక‌ట్టుకుంటున్న దివి వాధ్యా మ‌ళ్లీ ఓ అందాల పోస్ట్‌తో నెటిజ‌న్ల‌ని ఆక‌ర్షిస్తోంది.

By:  Tupaki Desk   |   4 April 2025 4:59 AM
Tollywood Actress Divi Vadthya
X

సోష‌ల్‌మీడియాలో నిత్యం అప్‌డేట్స్ ఇస్తూ యూత్‌ను ఆక‌ట్టుకుంటున్న దివి వాధ్యా మ‌ళ్లీ ఓ అందాల పోస్ట్‌తో నెటిజ‌న్ల‌ని ఆక‌ర్షిస్తోంది. బిగ్‌బాస్ షోతో గుర్తింపు అందుకున్న దివి త‌రువాత టాలీవుడ్‌లో కాస్త బిజీగా కనిపించింది. మోడ‌ల్‌, యాక్ట్రెస్‌, యాంక‌ర్‌గా బిజీగా మారిన దివి ఆమధ్య ‘లంబ‌సింగి’ అనే సినిమాతో హీరోయిన్‌గా కూడా తెర‌మీద‌కు వ‌చ్చింది.


ఇక లేటెస్ట్ గా దివి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫోటోలు అభిమానుల దృష్టిని ఆక‌ర్షించాయి. ఎలిఫెంట్ ముద్ర‌ల‌తో డిజైన్ చేసిన బ్లూ షార్ట్ కాఫ్టాన్ డ్రెస్‌లో ఆమె బ్యూటిఫుల్ లుక్‌తో మెరిసిపోయింది. ఓ కొండ ప్రాంతం నేప‌థ్యంలో షూట్ చేసిన ఈ ఫోటోల‌కు దివి ఇచ్చిన క్యాప్ష‌న్ చాలా ఇంట్ర‌స్టింగ్‌గా ఉంది. “వెధర్ ఇంత బాగుంది, కానీ నువ్వు నా పక్కన లేవు.. నీకైనా ఇది న్యాయమా?” అంటూ రొమాంటిక్‌గా ఓ లైన్ రాసింది.


దివి పెట్టిన ఈ లైన్‌కు సంబంధించి నెటిజ‌న్లు కామెంట్స్‌లో ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. ప్రకృతిలో నీ అందం మరింత హైలెట్ అవుతోంది అంటూ ఫ్యాన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఫ్యాష‌న్‌లో టాప్ ట్రెండ్స్‌తో పోటీగా పోజులు ఇస్తుంటే.. దివి స్టైల్‌లో మాత్రం ఓ క్లాస్ టచ్ ఉంటుంది. ఆమె డ్రెస్ ఎప్పుడూ ట్రెండీగానే ఉంటుందే గానీ.. త‌న హావభావాలతో ఓ సాఫ్ట్ నెస్‌ని చూపిస్తుంటుంది.

ఈ ఫోటోలలోనూ అదే కనిపిస్తుంది. నేచుర‌ల్ సెట్టింగ్‌లో చేసిన ఈ ఫోటోషూట్ దివి ప్ర‌త్యేకంగా ఆక‌ర్ష‌ణ‌నిచ్చింది. ప్ర‌స్తుతం దివి సినిమాలు, వెబ్‌సిరీస్‌ల‌తో పాటు సోషల్ మీడియాలోను హాట్ టాపిక్ అవుతోంది. త‌న గ్లామ‌ర్ పోస్ట్‌లు, ఫిట్‌నెస్ వీడియోల‌తో త‌రుచూ ట్రెండ్ అవుతుంటుంది. ఇక ఈ ఫోటోల త‌రువాత మ‌ళ్లీ ఎలాంటి అప్డేట్ ఇవ్వ‌బోతుందో అంటూ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.