Begin typing your search above and press return to search.

పిక్‌ టాక్‌ : సగం కాలిన ఫేస్‌ తో హీరోయిన్‌!

2003 సంవత్సరంలో 'ఒట్టేసి చెబుతున్నా' చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కనిహా సుబ్రమణ్యం.

By:  Tupaki Desk   |   9 Sep 2024 11:07 AM GMT
పిక్‌ టాక్‌ : సగం కాలిన ఫేస్‌ తో హీరోయిన్‌!
X

2003 సంవత్సరంలో 'ఒట్టేసి చెబుతున్నా' చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ కనిహా సుబ్రమణ్యం. మొదటి సినిమాతో టాలీవుడ్ లో సక్సెస్‌ ను దక్కించుకున్న ఈమె ఆ తర్వాత పలువురు స్టార్‌ హీరోల సినిమాల్లో నటించింది. అయితే కొంత కాలానికే ఈమెకు మెల్ల మెల్లగా ఆఫర్లు తగ్గాయి. దాంతో మలయాళం ఇతర సినిమా ఇండస్ట్రీ వైపు ఈమె అడుగులు వేసింది. లక్కీగా మలయాళంలో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ గా, స్టార్‌ హీరోయిన్‌ గా గుర్తింపు దక్కించుకుంది. అప్పుడప్పుడు ఇతర భాషల్లోనూ నటిస్తోంది.


సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌ గా ఉండే కనిహా ఇటీవల షేర్‌ చేసిన ఈ ఫోటో వైరల్‌ అవుతోంది. సగం కాలిన మొహంతో కనిహా గుర్తు పట్టనంతగా ఉంది. చూసిన వెంటనే బాబోయ్‌ అనిపించేంత భయంకరంగా ఉన్న ఈ ఫోటోను షేర్‌ చేసిన కనిహా తాను విజయ్ హీరోగా నటించిన ది గోట్‌ సినిమాలో గెస్ట్‌ రోల్‌ చేసినట్లుగా చెప్పుకొచ్చింది. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు దర్శకుడు వెంకట్‌ ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేసింది. సినిమాలో ఆమె వచ్చేది చాలా కొద్ది సమయమే అయినా గుర్తుండిపోయే పాత్ర చేసిందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ మధ్య కాలంలో హీరోయిన్ గానే కాకుండా ముఖ్య క్యారెక్టర్స్‌ లో కూడా నటిస్తోంది. తెలుగు లో మంచి అవకాశాలు వస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంది. కనికా సోషల్‌ మీడియాలో 1.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ను కలిగి ఉంది. రెగ్యులర్‌ గా తన అందమైన ఫోటోలతో పాటు, ఇలా సినిమాలకు సంబంధించిన స్టిల్స్ ను షేర్ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈసారి ఇలా కాలిన మొహంను షేర్‌ చేయడంతో అంతా కూడా షాక్‌ అవుతున్నారు. కనిహా ఏమైంది అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. కొందరికి సినిమా స్టిల్‌ అని తెలియక ఆందోళనగా కామెంట్స్ చేశారు.

ది గోట్ సినిమాలో చిన్న పాత్ర పోషించినప్పటికీ ముందు ముందు ఆ పాత్ర వల్ల మరిన్ని ఆఫర్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెట్టింట ఈ అమ్మడి సందడి మామూలుగా లేదు. ఇలాంటి సమయంలో సినిమా స్టిల్‌ ను షేర్‌ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందమైన కనిహా ఇలా కాలిన మోహం షేర్‌ చేయడంను తాము జీర్ణించుకోలేక పోతున్నాం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలాంటి పాత్రలు, సినిమాలు చేయడం గొప్ప విషయం. ముందు ముందు కనిహా మరిన్ని మంచి పాత్రలు, సినిమాలు చేయాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.