లావణ్య అందాల మాయ.. వావ్ అనాల్సిందే!
టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి, ఇప్పుడు గ్లామర్‌తో మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది.
By: Tupaki Desk | 13 March 2025 6:00 PM ISTటాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న లావణ్య త్రిపాఠి, ఇప్పుడు గ్లామర్‌తో మరోసారి నెట్టింట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోషూట్‌లో లావణ్య తన రేంజ్‌ను మరోసారి ప్రూవ్ చేసుకుంది. బంగారు వర్ణంలో మెరిసిపోయే శరీర సొగసుతో ఆమె స్టన్నింగ్ లుక్ ఫ్యాన్స్‌ను ముగ్దులను చేస్తోంది.
ఈ ఫోటోషూట్‌లో లావణ్య ధరించిన అవుట్‌ఫిట్ నిజంగా క్లాస్ ఎలిగెన్స్‌కి కలయికగా ఉంది. గోల్డ్ షిమ్మరీ గౌన్‌లో ఆమె క్యూట్ లుక్స్ తో కూడిన కాన్ఫిడెంట్ పోజులు అసలైన హైలైట్. వెవ్స్ లాగా ఆమె జుట్టు, రెడ్ లిప్‌స్టిక్‌తో ఆమె లుక్ మరింత ఆకర్షణీయంగా మారింది. 'రాజెల్ డ్యాజెల్' అంటూ క్యాప్షన్‌తో షేర్ చేసిన ఈ ఫోటోలు ఒక్కరోజులోనే జెట్ స్పీడ్ లో వైరల్ అయ్యాయి.
లావణ్య తన కెరీర్‌ను ‘అందాల రాక్షసి’ సినిమాతో ప్రారంభించి, ఎన్నో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులకు చేరువైంది. కానీ గత కొంత కాలంగా ఆమె సినిమాల పరంగా పెద్దగా హైలెట్ కాలేదు. ఇక వరుణ్ తేజ్ ను వివాహం చేసుకున్న తరువాత డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది. అయితే తన స్టన్నింగ్ ఫొటోషూట్లతో మాత్రం ఎప్పటికప్పుడు హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటోంది. ఈ ఫోటోషూట్ కూడా అదే రేంజ్‌లో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన ప్రతి అప్డేట్‌ను ఫ్యాన్స్‌తో పంచుకునే లావణ్య, ఫ్యాషన్ స్టేట్‌మెంట్ పెట్టడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఈ లుక్‌కి సంబంధించిన స్టైలింగ్ టీమ్, జ్యుయలరీ బ్రాండ్ డిటైల్స్‌ను కూడా తన పోస్ట్‌లో ట్యాగ్ చేస్తూ, తనను మేకోవర్ చేసిన క్రెడిట్‌ను కూడా అందించడంలో కచ్చితంగా ముందుంటుంది. సినిమాల్లో బిజీగా లేకపోయినా లావణ్య తన క్రేజ్‌ను అలాగే కొనసాగిస్తోంది.