Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : చీర కట్టి, పూలు పెట్టిన ఈమె ఎవరో తెలుసా?

ఇప్పటికే ఈమె ఎవరు అనే విషయంలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అవును ఈ అమ్మడు మాళవిక మోహనన్‌.

By:  Tupaki Desk   |   18 March 2025 4:00 PM IST
పిక్‌టాక్ : చీర కట్టి, పూలు పెట్టిన ఈమె ఎవరో తెలుసా?
X

కమర్షియల్‌ హీరోయిన్‌ అంటే స్కిన్‌ షో చేయడంతో పాటు, మోడ్రన్‌ డ్రెస్‌ల్లో తళుక్కున మెరవాలి. కానీ ఈమె ముతక చీరలో, మెడలో మల్లెపూలు పెట్టుకుని కనిపించడం చాలా అరుదుగా మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చీర కట్టి మల్లె పూలు పెట్టి సంసార పక్షంగా ఉన్న ఈ హీరోయిన్‌ను గుర్తు పట్టారా... తమిళ్‌తో పాటు మలయాళంలో పలు సినిమాలు చేసిన ఈమె తెలుగులో త్వరలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయింది. ఏకంగా ప్రభాస్‌కి జోడీగా ఈమె ఒక సినిమాలో నటిస్తుంది. ఆ సినిమా విడుదల అయితే టాలీవుడ్‌లో మోస్ట్‌ బిజీ హీరోయిన్‌గా ఈమె పేరు సొంతం చేసుకుని, వరుసగా తెలుగు సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి.


ఇప్పటికే ఈమె ఎవరు అనే విషయంలో మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. అవును ఈ అమ్మడు మాళవిక మోహనన్‌. ప్రస్తుతం ఈమె తెలుగులో ప్రభాస్‌ రాజాసాబ్‌ సినిమాలో నటించి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధం అవుతోంది. తెలుగుతో పాటు తమిళ్‌, హిందీ సినిమాల్లోనూ ఈమె నటిస్తూ బిజీ బిజీగా ఉంది. సాధారణంగా మాళవిక మోహనన్ సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌గా అందాల ఆరబోత ఫోటోలను షేర్‌ చేయడం ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. కానీ ఈసారి మాళవిక ఇలా చీర కట్టులో గుర్తు పట్టనంత సింపుల్‌గా ఉండటం వల్ల వార్తల్లో నిలిచింది. ఆకట్టుకునే అందంతో పాటు మంచి ఫిజిక్‌ మాళవిక సొంతం అంటూ నెటిజన్స్‌ తెగ కామెంట్‌ చేస్తూ ఉంటారు.

మాళవికను ఇలా చూస్తూ ఉంటే ఇంకా బాగుందని అనిపిస్తుంది అంటూ అభిమానులు కామెంట్‌ చేస్తున్నారు. సాధారణంగా కొందరు హీరోయిన్స్ మోడ్రన్‌ డ్రెస్‌ల్లో మాత్రమే చూడ్డానికి చక్కగా ఉంటారు, వారిని ఆ డ్రెస్‌ల్లో మాత్రమే చూడగలం. కానీ మాళవిక మోహనన్ మాత్రం ప్రతి ఔట్‌ ఫిట్‌లోనూ ఆకట్టుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఇలా చీర కట్టులోనూ మాళవిక ఆకట్టుకుంటూ ఉందని, ఇంతటి అందం కేవలం మాళవిక మోహనన్‌కే సాధ్యం అంటూ కొందరు కామెంట్‌ చేస్తున్నారు. చీర కట్టులో ఇంత సింపుల్‌గా ఉన్నా పద్దతి అయిన లుక్‌లో భలే ఉంది అంటూ ఫ్యాన్స్ ఈమె ఫోటోలను తెగ షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తున్నారు.

గత ఏడాది ఈమె ముఖ్య పాత్రలో నటించిన తంగలాన్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమా మిశ్రమ స్పందన దక్కించుకున్నా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకునే విధంగా మాళవిక మోహనన్‌ నటించి మెప్పించింది. ఇక ఈ ఏడాదిలో ఈమె నటించిన రాజాసాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరో వైపు సర్దార్‌ 2 సినిమాలోనూ మాళవిక మోహనన్‌ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది. మాళవిక మోహనన్‌ రాబోయే రోజుల్లో మరింత బిజీగా టాలీవుడ్‌లో సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఈమె నటిస్తున్న రాజాసాబ్‌ సినిమా వచ్చే నెలలో విడుదల కావాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. కొత్త తేదీని త్వరలో ప్రకటిస్తారేమో చూడాలి.