పిక్‌టాక్ : చీర కట్టులో ఇస్మార్ట్ బ్యూటీ సూపర్
నన్ను దోచుకుందువటే సినిమాతో 2018లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్.
By: Tupaki Desk | 27 Feb 2025 5:06 PM ISTనన్ను దోచుకుందువటే సినిమాతో 2018లో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్‌గా పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్. మొదటి సినిమాతోనే అందంతో పాటు నటనతోనూ మెప్పించిన ఈ అమ్మడు టాలీవుడ్‌లో ఆ వెంట వెంటనే సినిమాల్లో ఆఫర్లు దక్కించుకుంది. టాలీవుడ్‌లో అడుగు పెట్టిన తదుపరి ఏడాదిలోనే డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రామ్ కి జోడీగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఆ సినిమాలో నటనతో మరోసారి తన సత్తా చాటింది. ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కావడంతో పాటు నభా నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి, ఆమె డైలాగ్ డెలివరీ అన్నింటికి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత పలు సినిమాల్లో నటించిన నభా నటేష్ కొన్ని కారణాల వల్ల 2022, 23 లో సినిమాల్లో కనిపించలేదు. గత ఏడాది 'డార్లింగ్' అనే వెబ్ మూవీలో కనిపించింది. మరోసారి తన నటనతో మెప్పించింది. డార్లింగ్‌తో మరోసారి నభా నటేష్ బిజీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం స్వయంభూ సినిమాలో నటిస్తున్న నభా నటేష్ మరో రెండు మూడు సినిమాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం అందుతోంది. త్వరలో నభా నటేష్ కొత్త సినిమాలకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
సినిమాలతో ఈమధ్య కనిపించకున్నా నభా నటేష్ ఫోటో షూట్స్‌లతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా మరోసారి అందమైన ఫోటోలతో కన్నుల విందు చేసింది. నభా నటేష్ ఆకట్టుకునే రూపం కారణంగా చీర కట్టులో ఎప్పుడూ చాలా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఎప్పటిలాగే తాజాగా మరోసారి చీర కట్టు ఫోటోల్లో ఆకట్టుకుంది. ఈసారి అంతకు మించి అనిపించేలా అందమైన చీర కట్టులో జుట్టులో మల్లెపూలు ధరించి కొంటెగా చూస్తూ కెమెరాకు ఫోజ్ ఇచ్చింది. అందమైన నభా నటేష్ ఈ చీర కట్టులో మరింత అందంగా కనిపిస్తుంది అంటూ నెటిజన్స్, అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నభా నటేష్ అందమైన ఫోటో షూట్ వైరల్ కావడం కొత్తేం కాదు. గతంలో ఎన్నో సార్లు ఆమె స్కిన్ షో చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. అయితే ఇలా నిండైన చీర కట్టులోనూ అందంగా కనిపిస్తుంది అంటూ ఈ ఫోటోలను సైతం నెటిజన్స్ తెగ షేర్ చేస్తున్నారు. చీర కట్టు ఫోటోలకు ఈ స్థాయి రెస్పాన్స్ దక్కడం చాలా అరుదుగా ఉంటుంది. నభా నటేష్ మోడ్రన్ డ్రెస్‌లతో పాటు ఇలా చీర కట్టులోనూ చాలా అందంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నభా నటేష్ ఇంతటి అందానికి దక్కాల్సిన ఆఫర్లు దక్కడం లేదని, ఇండస్ట్రీలో టాప్ స్టార్ హీరోయిన్‌గా ఈ అమ్మడు సినిమాలు చేయాలని ఫ్యాన్స్ అంటున్నారు.