గ్రీన్ బ్యూటీలో సన్ ప్లవర్ లా బుట్టబొమ్మ!
ఫ్యాషన్ వరల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెషలిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు.
By: Tupaki Desk | 28 Sep 2024 2:30 PM GMTఫ్యాషన్ వరల్డ్ లో ముంబై బ్యూటీ పూజాహెగ్డే ఓ స్పెషలిస్ట్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమ్మడి ఎంపికలు అమెలో బ్యూటీని అంతకంతకు హైలైట్ చేస్తుంటాయి. కటౌట్ కి తగ్గట్టు సొగసరి ఎంపిక చేసుకునే దుస్తులే అందాన్ని రెట్టింపు చేస్తుంటాయి. హైట్..వెయిట్ కి తగ్గట్టు అలంకరణ విషయంలో ఎంతో శ్రద్ద తీసుకుంటుంది. డిజైనర్ దుస్తులైనా...సంప్రదాయ వస్త్రాలైనా బుట్ట బొమ్మ ధరించిందంటే ఆ దుస్తులకే వన్నె వచ్చేస్తుంది.
తాజాగా అమ్మడు గ్రీన్ బ్యాక్ గ్రౌండ్ లో సన్ ప్లవర్ పువ్వులతో ఇలా మురిపిస్తోంది. ఇదిగో ఇక్కడిలా అమ్మడు బ్యాక్ గ్రౌండ్ ని మ్యాచ్ చేస్తూ డిజైనర్ పచ్చందం దుస్తుల్లో ఒదిగిపోయింది. గ్రీన్ కలర్ కోట్ పై మ్యాచింగ్ గా డిఫరెంట్ లెగ్ ఇన్ ఎంపిక చేసుకుంది. పువ్వుల డిజైన్ లెగ్ ఇన్ పై చేతులకు..కాళ్లకు ధరించిన సాక్సులు సైతం అదే డిజైన్ తో కూడినవి. వీటిలో మ్యాడం ఎంతో అందంగా హైలైట్ అవుతుంది.
చేతిలో సన్ ప్లవర్ పువ్వులు పట్టుకుంది. రెండు కళ్లు మూసుకుంది. కాళ్లకు హైహీల్స్ ధరించింది. ఈ మొత్తం సన్నివేశాన్నిహైలైట్ చేస్తూ కెమారాకి వివిధ భంగిమల్లో ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. దీపికలో మెరుపు ఏమాత్రం తగ్గలేదు. ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎలా ఉందో? ఇప్పటికీ అదే బ్యూటీని మెయింటెన్ చేస్తోంది.
ఇక పూజా కెరీర సంగతి చూస్తే..టాలీవుడ్ నుంచి ఎంత సాలిడ్ గా వెళ్లిందో? అంతే సాలిడ్ గా అమ్మడు సౌత్ లో కంబ్యాక్ అవుతోన్న విషయం తెలిసిందే. యువ సామ్రాట్ నాగచైతన్య సరసన ఓ కొత్త సినిమాకి ఇటీవలే సంతకం చేసింది. అతి త్వరలోనే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. అలాగే కోలీవుడ్ లో సూర్య 44వ చిత్రంలోనూ పూజ అవకాశం అందుకుంది.