డాకు ప్రమోషన్స్‌లో ప్రగ్య స్టన్నింగ్
ఎన్బీకే సరసన `డాకు మహారాజ్`లో నటించింది ప్రగ్య జైశ్వాల్. తన అద్భుత నటనకు మంచి పేరొచ్చింది.
By: Tupaki Desk | 1 Feb 2025 4:15 AM GMTఎన్బీకే సరసన `డాకు మహారాజ్`లో నటించింది ప్రగ్య జైశ్వాల్. తన అద్భుత నటనకు మంచి పేరొచ్చింది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన బాలయ్య ఇప్పుడు `డాకు మహారాజ్` రూపంలో ప్రగ్యకు మంచి బ్లాక్ బస్టర్ ని ఇచ్చాడు. ఈ సందర్భంగా ఆనందోత్సాహాల్లో మునిగి తేల్తోంది ప్రగ్య. ఈ విజయం సౌత్ లో తన కెరీర్ ఎదుగుదలకు సహకరిస్తుందని ఆశిస్తోంది.
తాజాగా `డాకు మహారాజ్` విజయోత్సవ ప్రచార వేదికపై ప్రగ్య ఎంతో ఆనందంగా కనిపించింది. ``ఈ సంవత్సరాన్ని మరింత మెరుగ్గా ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. జనవరి ఎంత అద్భుతమైన నెలగా మారింది - మొదటి వారంలోనే 3 ఖండాలు ప్రయాణించాను. అత్యంత రద్దీగా, క్రేజీగా, అత్యంత అలసిపోయేలా చేసింది కానీ.. అత్యంత సంతోషకరమైనది & అత్యంత సంతృప్తినిచ్చింది. అందరి ప్రేమకు ధన్యవాదాలు. నా హృదయం చాలా నిండిపోయింది! మిగిలిన సంవత్సరం ఎలా ఉంటుందో వీక్షించే వరకు వేచి ఉండలేను`` అని రాసింది.
ఈవెంట్లో ప్రగ్య సాంప్రదాయ చీరకట్టులో ఎంతో అందంగా కనిపించింది. బ్లాక్ అండ్ పర్పుల్ కలర్ కాంబినేషన్ శారీలో ధగధగా మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ అందమైన ఫోటోగ్రాఫ్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది. ప్రగ్య నెక్ట్స్ ఏమిటో ప్రకటించాల్సి ఉంది. బ్లాక్ బస్టర్ `డాకు మహారాజ్`ని సల్మాన్ ఖాన్ రీమేక్ చేస్తే బావుంటుందని ప్రగ్య సూచించిన సంగతి తెలిసిందే.