Begin typing your search above and press return to search.

పిక్‌టాక్ : ప్రగ్యా అందాల షో అరాచకం

తెలుగు ప్రేక్షకులకు మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో పరిచయం అయినా 'కంచె' సినిమాతో స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌.

By:  Tupaki Desk   |   1 March 2025 7:41 AM GMT
పిక్‌టాక్ : ప్రగ్యా అందాల షో అరాచకం
X

తెలుగు ప్రేక్షకులకు మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో పరిచయం అయినా 'కంచె' సినిమాతో స్టార్‌డం దక్కించుకున్న ముద్దుగుమ్మ ప్రగ్యా జైస్వాల్‌. మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా కమర్షియల్‌గా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది. ముఖ్యంగా హీరోయిన్‌గా నటించిన ప్రగ్యా జైస్వాల్‌పై ఆ సమయంలో పాజిటివ్‌ కామెంట్స్ వచ్చాయి. ముందు ముందు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌గా సినిమాలు చేయబోతుంది అనే విశ్వాసంను చాలా మంది వ్యక్తం చేశారు. కానీ కట్‌ చేస్తే టాలీవుడ్‌లో కంచె తర్వాత ఆ స్థాయి గుర్తింపు తెచ్చి పెట్టిన పాత్ర ఆమెకు దక్కలేదు.


ఒకటి రెండు హిట్స్ ఆమె ఖాతాలో పడ్డా అవి ఆమెకు ఆఫర్లు తెచ్చి పెట్టలేక పోయాయి. అయినా కెరీర్‌లో నిలదొక్కుకోవడం కోసం పదేళ్లుగా ఇండస్ట్రీలో ఆఫర్ల కోసం కుస్తీ పడుతుంది. అడపా దడపా ఆఫర్లు వస్తూ ఇంకా ఇండస్ట్రీలో కొనసాగుతోంది. సక్సెస్‌ దక్కాలి, మంచి పాత్ర పడాలని ప్రగ్యా చాలా కాలంగా వెయిట్‌ చేస్తుంది. ఇండస్ట్రీలో హిట్‌ లేకున్నా ఇన్నాళ్లు కొనసాగడంకు ప్రధాన కారణం ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు అనడంలో సందేహం లేదు. రెగ్యులర్‌గా సోషల్‌ మీడియా ద్వారా అందమైన ఫోటోలను షేర్‌ చేస్తూ ఉంటుంది. దాంతో ఈ అమ్మడు ఎప్పుడు చూసినా వార్తల్లో ఉంటుంది.


తాజాగా మరోసారి తన అందమైన ఫోటోలను షేర్‌ చేసింది. ఈసారి ఇన్నర్స్‌ను చూపిస్తూ వయ్యారాలు ఒలకబోస్తూ కవ్విస్తున్నట్లుగా ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చింది. దాంతో ఈ అమ్మడు మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ స్థాయి అందాల ఆరబోత కేవలం ప్రగ్యా జైస్వాల్‌కే సాధ్యం అంటూ నెట్టింట కొందరు కామెంట్‌ చేస్తున్నారు. ఇంత అందం ఉన్నా కూడా ప్రగ్యాకి సరైన ఆఫర్లు రాకపోవడం విడ్డూరంగా ఉంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి ముందు ముందు అయినా ఆఫర్లు రావాలని అభిమానులు, ఫాలోవర్స్ కోరుకుంటున్నారు. ఈ ఫోటోల్లో ప్రగ్యా అందాలు అరాచకం అంటూ తెగ లైక్‌ చేస్తూ షేర్‌ చేస్తున్నారు.


ప్రగ్యా ఇటీవల బాలకృష్ణతో కలిసి వచ్చిన డాకు మహారాజ్‌ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయినా వెంటనే ఈ అమ్మడికి ఆఫర్లు రావడం లేదు. తెలుగులో ఈ అమ్మడు అఖండ 2 సినిమాలో నటించే అవకాశాలు దక్కించుకుంది. అఖండ సినిమాలో నటించిన ప్రగ్యా కి సీక్వెల్‌లో నటించే అవకాశం దక్కింది. బాలయ్యతో మూడో విజయాన్ని అఖండ 2 తో దక్కించుకోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. ఆ విజయంతో అయినా టాలీవుడ్‌లో ప్రగ్యా జైస్వాల్‌ బిజీ అయ్యేనా చూడాలి.