డాగ్స్‌తో బోల్డ్ నటి స్నేహం
సందీప్ కిషన్ `జోరు` చిత్రంలో నటించింది ప్రియా బెనర్జీ. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నటనతో పాటు ప్రియా బెనర్జీ వేడెక్కించే గ్లామర్ షో ఆకట్టుకుంటుంది.
By: Tupaki Desk | 3 Feb 2025 5:30 AM GMTసందీప్ కిషన్ `జోరు` చిత్రంలో నటించింది ప్రియా బెనర్జీ. ఈ చిత్రంలో రాశీ ఖన్నా నటనతో పాటు ప్రియా బెనర్జీ వేడెక్కించే గ్లామర్ షో ఆకట్టుకుంటుంది. బోల్డ్ అండ్ డస్కీ బ్యూటీగా పేరున్న ప్రియా బెనర్జీ 2013లో `కిస్` చిత్రంతో టాలీవుడ్ కి పరిచయమైంది. అడవి శేష్ నటించి స్వయంగా దర్శకత్వం వహించిన చిత్రమిది. కృష్ణ విజయ్, నారా రోహిత్ ప్రధాన పాత్రలు పోషించిన `అసుర` చిత్రంలోను ప్రియా బెనర్జీ నటించింది. ప్రియా అందచందాలు, గ్లామర్ డోస్ యూత్‌కి నచ్చినా, ఆ తర్వాత రేర్ గా ఛాన్సులొచ్చాయి. పలు తమిళ హిందీ చిత్రాల్లోను ప్రియా నటించింది. ప్రియా సోషల్ మీడియా ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారుతున్నాయి. ఈ బ్యూటీ డాగ్స్ తో స్నేహంగా ఉంటుంది. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేయగా, అవి వైరల్ గా మారుతున్నాయి.
ప్రేమికుల రోజున పెళ్లి:
తాజా సమాచారం మేరకు `కిస్` బ్యూటీ ప్రియా బెనర్జీ పెళ్లి కబురు అందింది. ప్రముఖ నటుడు ప్రతిక్ పాటిల్ బబ్బర్ - ప్రియా బెనర్జీ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం రోజున వివాహం చేసుకోనున్నారు. ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు మాత్రమే హాజరవుతారు. ఈ వేడుక ముంబై- బాంద్రాలోని ప్రతీక్ ఇంట్లో జరుగుతుందని భావిస్తున్నారు. ప్రతిక్ బబ్బర్ - ప్రియా బెనర్జీ నవంబర్ 2023లో నిశ్చితార్థం చేసుకున్నారు. గత సంవత్సరం ప్రేమికులు బాంబే టైమ్స్ నిర్వహించిన వాలెంటైన్స్ స్పెషల్ ఇంటర్వ్యూలో కనిపించారు. ప్రియాతో ప్రతీక్ తొలి చూపులోనే ప్రేమలో పడిపోయానని ఇంటర్వ్యూలో చెప్పాడు.
ప్రతీక్ పాటిల్ బబ్బర్ సిల్వర్ స్పూన్ నటుడు. ముంబైలో ధనిక కుటుంబంలో జన్మించాడు. అతడు హిందీ చిత్రాల్లో ప్రముఖంగా కనిపిస్తాడు. అబ్బాస్ టైరేవాలా చిత్రం `జానే తూ... యా జానే నా`(2008)తో ప్రతీక్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు. ఈ చిత్రంలో ఇమ్రాన్ ఖాన్ , జెనీలియా డిసౌజా ప్రధాన పాత్రలు పోషించారు. ఆ తర్వాత ధోబీ ఘాట్, బాఘీ 2, బచ్చన్ పాండే, చిచోరే వంటి సినిమాల్లో ప్రతీక్ నటించాడు. సల్మాన్ ఖాన్ - మురుగదాస్ భారీ యాక్షన్ చిత్రం సికందర్‌లో కనిపించనున్నాడు. మరోవైపు ప్రియా బెనర్జీ దిల్ జో నా కెహ్ సాకా, హమ్ తుమ్సే ప్యార్ కిత్నా వంటి బాలీవుడ్ చిత్రాలలో నటించింది.