Begin typing your search above and press return to search.

పిక్ టాక్‌ : పొలంలో రకుల్‌ చిల్లింగ్‌ మూడ్‌

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంది.

By:  Tupaki Desk   |   21 Sep 2024 2:45 AM GMT
పిక్ టాక్‌ : పొలంలో రకుల్‌ చిల్లింగ్‌ మూడ్‌
X

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఈ మధ్య కాలంలో సినిమాల్లో కంటే ఎక్కువ సోషల్ మీడియాలో కనిపిస్తుంది. ఒకానొక సమయంలో టాలీవుడ్‌ లో మోస్ట్‌ బిజీ హీరోయిన్ గా సినిమాలు చేసిన ఈ అమ్మడు కోలీవుడ్‌, బాలీవుడ్‌ లోనూ సినిమాలు చేసిన విషయం తెల్సిందే. తెలుగు లో సినిమా ఆఫర్లు తగ్గిన సమయంలో బాలీవుడ్, కోలీవుడ్‌ లో ఆఫర్లు వచ్చినా పెద్దగా అక్కడ వర్కౌట్ అవ్వలేదు. హీరోయిన్‌ గా ఈ అమ్మడు చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. దాంతో రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఏ భాషలోనూ సినిమా ఆఫర్లు లేక పోవడంతో సోషల్ మీడియాలో తన అందాల ఫోటో షూట్స్ ను షేర్ చేస్తూ మళ్లీ ఆఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తోంది.


రకుల్‌ ప్రీత్‌ సింగ్ తెలుగు లో కెరటం సినిమాతో 2011 లో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నటించిన వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌ విజయాన్ని సొంతం చేసుకోవడంతో వరుసగా టాలీవుడ్‌ లో సినిమా ఆఫర్లు దక్కించుకుంది. ఒకానొక సమయంలో స్టార్‌ హీరోల సినిమాలకు సైతం డేట్లు ఇవ్వలేనంత బిజీగా రకుల్‌ సినిమాలు చేసింది. కానీ నాలుగు అయిదు సంవత్సరాల్లోనే రకుల్‌ క్రేజ్ తగ్గింది. తక్కువ సమయంలో ఎక్కువ సినిమాలు చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ సోషల్‌ మీడియాలో మాత్రం అప్పుడు ఇప్పుడూ తన అందాల ఆరబోత ఫోటోలతో సందడి చేస్తూనే ఉంది. నెట్టింట మరోసారి రకుల్‌ తన అందాల ఫోటోలతో రచ్చ చేస్తోంది.

ఇన్‌స్టాగ్రామ్‌ లో దాదాపుగా 24 మిలియన్ ల ఫాలోవర్స్ ను కలిగి ఉన్న రకుల్‌ ప్రీత్ సింగ్ రెగ్యులర్‌ గా తన ఫోటోలను షేర్‌ చేయడం మనం చూస్తూ ఉంటాం. రకుల్‌ ఏ ఫోటోను షేర్ చేసినా లక్షల్లో లైక్స్‌, వేలల్లో కామెంట్స్ వస్తూ ఉంటాయి. ప్రతి ఫోటో వైరల్‌ అవ్వడం జరుగుతుంది. తాజాగా ఒక షూట్ ను ముగించుకుని పొలంలో ఇలా సరదాగా టైం స్పెండ్‌ చేసిన ఫోటోలను షేర్‌ చేసింది. అందాల రకుల్ ప్రీత్‌ సింగ్‌ అంతకు మించిన అందమైన ప్రకృతిలో చిల్‌ అవ్వడంను ఈ ఫోటోలో చూడవచ్చు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ అందమైన ఈ ఫోటోలకు నెట్టింట పెద్ద ఎత్తున లైక్స్, కామెంట్స్‌ వస్తున్నాయి.

బాలీవుడ్‌ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ నటించిన దే దే ప్యార్ దే సినిమా కు మంచి స్పందన వచ్చింది. దాంతో బాలీవుడ్‌ లో వరుస సినిమాలు చేసే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ అక్కడ ఆ తర్వాత వరుసగా ఆఫర్లు రాలేదు. నెట్టింట మాత్రం రకుల్‌ కి బాలీవుడ్‌ హీరోయిన్స్ స్థాయిలో క్రేజ్ దక్కింది. ఆ సినిమాలో అందాల ఆరబోత చేసినా పెద్దగా ప్రయోజనం దక్కలేదు. ప్రతి ఫోటో లోనూ కొత్తదనం చూపిస్తూ తన ఫాలోవర్స్ కి కన్నుల విందు చేసే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి ఆకట్టుకుంది. అందమైన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఫోటోలు మరోసారి వైరల్‌ అవుతున్నాయి.