యాక్షన్ సినిమాలకు సూటవుతాను: షాలిని పాండే
షాలినిపాండే పరిచయం అవసరం లేదు. తనదైన అద్భుత నటప్రతిభతో మైమరిపిస్తున్న యువనటి.
By: Tupaki Desk | 29 Aug 2024 3:30 PM GMTషాలినిపాండే పరిచయం అవసరం లేదు. తనదైన అద్భుత నటప్రతిభతో మైమరిపిస్తున్న యువనటి. అర్జున్ రెడ్డి, మహానటి, జయేష్‌భాయ్ జోర్దార్ లాంటి చిత్రాల్లో నటించింది. ఇటీవల విడుదలైన మహారాజ్ సినిమాలలో తనదైన ఎనర్జిటిక్ నటనతో ప్రేక్షకులను మరోసారి కట్టి పడేసింది. అయితే తన స్థాయికి తగ్గ ఆఫర్లు రావడం లేదనేది షాలిని ప్రధాన ఆరోపణ. తాజా ఇంటర్వ్యూలో తాను తదుపరి యాక్షన్ సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపింది. నేను శారీరక శ్రమలో బాగానే రాటు దేలాను.. అందువల్ల యాక్షన్ చిత్రాలు చేస్తానని అంది.
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో షాలిని పాండే తనలో ఇంటర్నల్‌గా దాగి ఉన్న రహస్య నైపుణ్యాల గురించి వెల్లడిస్తూ, ``నాకు డ్యాన్స్, క్రీడలు చాలా ఇష్టం. నేను ఇప్పటికే `మహారాజ్` చిత్రంలో డ్యాన్స్ చేశాను. స్విమ్మింగ్‌తో పాటు, బ్యాడ్మింటన్, వాలీబాల్‌లోను నేను బాగా రాణిస్తాను. నాకు శారీరక శ్రమ బాగా అలవాటే. కాబట్టి యాక్షన్ సినిమా చేయాలనుకుంటున్నాను`` అని అన్నారు.
షాలిని గత సినిమాల్లో నటిగా తన రేంజ్‌ని ప్రేక్షకులు చూసినప్పటికీ యాక్షన్ అవతార్‌లో కనిపిస్తే ఎగ్జైటింగ్‌గా ఉంటుంది. కత్రిన, దీపిక, ఆలియా భట్ లాంటి స్టార్లు యాక్షన్ పాత్రలతో మెప్పించారు. ఇప్పుడు అదే కేటగిరీలో యాక్షన్ క్వీన్ అవ్వాలని ఈ యంగ్ బ్యూటీ కలలు కంటోంది. తన కల నెరవేరేలా మంచి ఆఫర్ వస్తుందేమో చూడాలి. ధూమ్, క్రిష్, వార్ ఫ్రాంఛైజీలు.. కల్కి 2989ఏడి సీక్వెల్ లో ఇలాంటి పాత్రలకు ఆస్కారం ఉంది. ప్రముఖ దర్శకులు తన ఆసక్తిని గమనించి సంప్రదిస్తారేమో చూడాలి. ముఖ్యంగా మహానటిలో అవకాశం కల్పించిన నాగ్ అశ్విన్ ఇప్పుడు మరోసారి ఆదుకుంటాడా? కల్కి సీక్వెల్ లో షాలినికి ఛాన్సిస్తాడా? అన్నది వేచి చూడాలి.
కెరీర్ మ్యాటర్‌కి వస్తే.. షాలినీ పాండే తదుపరి డబ్బా కార్టెల్, బండ్‌వాలే చిత్రాలలో కనిపించనుంది. నటన,నృత్యం, ఫైట్స్ ఇలా అన్ని విభాగాల్లో రాణించే నాయికలకు ఇప్పుడు అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. షాలినికి సాహసాలకు సై అనేస్తోంది గనుక తన పరిధి మరింత విస్తరిస్తుందనే ఆశిద్దాం.