Begin typing your search above and press return to search.

చీరలో శోభిత మెరుపులు

త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా రాబోతున్న తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల.

By:  Tupaki Desk   |   5 Sep 2024 3:46 AM GMT
చీరలో శోభిత మెరుపులు
X

త్వరలో అక్కినేని ఇంటికి కోడలిగా రాబోతున్న తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళ్ల. ఈ బ్యూటీ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా ఇన్ స్టాగ్రామ్ లో గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తూ ఉంటుంది. అలాగే తన సినిమాలు, ప్రయాణాలకు సంబందించిన అప్డేట్స్ ని కూడా ఈ బ్యూటీ పంచుకుంటూ ఉంటుంది. శోభితకి ఇన్ స్టాగ్రామ్ లో ఫాలోవర్స్ భారీగానే ఉన్నారు. తెలుగు అభిమానులు నాకంటే నార్త్ ఇండియాలో శోభితని ఫాలో అయ్యేవారు ఎక్కువగా ఉంటారు.


దీనికి కారణం శోభిత దూళిపాళ్ల హిందీ సినిమాలతోనే ఎక్కువ పాపులర్ అవ్వడమే. మోడలింగ్ లో కెరియర్ స్టార్ట్ చేసిన శోభిత 2013 మిస్ ఇండియా అందాల పోటీల్లో పాల్గొని రన్నరప్ గా నిలిచింది. తరువాత మిస్ ఎర్త్ అందాల పోటీలలో కూడా పాల్గొంది. ఆ తరువాత నటిగా రమన్ రాఘవ్ 2.ఓ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ మూవీ సక్సెస్ కావడంతో తరువాత వరుసగా అవకాశాలు వచ్చాయి.


గూఢచారి సినిమాలో అడివి శేష్ కి జోడీగా టాలీవుడ్ లోకి శోభిత ఎంట్రీ ఇచ్చింది. అయితే తెలుగమ్మాయి అయిన కూడా తెలుగులో శోభితకి పెద్దగా అవకాశాలు రాలేదు. గూఢచారి తర్వాత మరల అడివి శేష్ చేసిన మేజర్ మూవీలో కీలక పాత్రలో కనిపించింది. చివరిగా మంకీ మ్యాన్ అనే హాలీవుడ్ సినిమాతో శోభిత ప్రేక్షకుల ముందుకొచ్చింది. 2022 నుంచి శోభిత నాగ చైతన్యతో రిలేషన్ లో ఉంది. ఫైనల్ గా పెద్దలని ఒప్పించి ఇద్దరు ఒకటి కాబోతున్నారు.


ఈ బ్యూటీ డిజిటల్ ఎంట్రీ ఇచ్చి ఇప్పటికే మూడు వెబ్ సిరీస్ లలో నటించింది. ఆ మూడింటిలో కూడా శోభిత దూళిపాళ్ల బోల్డ్ అండ్ గ్లామర్ రోల్స్ లోనే కనిపించింది. త్వరలో పెళ్లి కూతురు కాబోతున్న శోభిత ఇన్ స్టాగ్రామ్ లో ట్రెడిషనల్ స్టైల్ లో చీరకట్టులో కనిపించి సందడి చేసింది. హైదరాబాద్ లో ఓ శారీ షోరూమ్ లో పాల్గొంది. అక్కడ దిగిన పిక్స్ ని ఇన్ స్టాగ్రమ్ లో షేర్ చేసింది.


ఈ ఫోటో క్రింద నెటిజన్లు, అక్కినేని ఫ్యాన్స్ ఇంటరెస్టింగ్ కామెంట్స్ పెడుతున్నారు. నాగ చైతన్యకి పర్ఫెక్ట్ గా సెట్ అవుతారంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈ శారీలో చాలా అందంగా ఉన్నారని ప్రశంసిస్తూ కొందరు పోస్టులు పెడుతున్నారు. ఇదిలా ఉంటే ఆమె నటించిన రెండు సినిమాలు హిందీలో షూటింగ్ కంప్లీట్ చేసుకొని రిలీజ్ కి రెడీ అవుతున్నాయి.