శ్రీలీల: చీరలో అప్సరస మెరుపులు
‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే.
By: Tupaki Desk | 3 Dec 2024 5:47 AM GMT‘పుష్ప 2’ కిస్సిక్ సాంగ్ తో శ్రీలీల ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చిన విషయం తెలిసిందే. సౌత్ ఇండియాలో క్రేజియస్ట్ హీరోయిన్ గా ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం డాన్సింగ్ క్వీన్ అనే ఇమేజ్ తో దూసుకుపోతోంది. కమర్షియల్ హీరోయిన్ గా ఓ వైపు స్టార్ హీరోలతో జతకడుతూ మరో వైపు పాన్ ఇండియా స్టార్స్ తో కూడా ఆడిపాడే అవకాశాలు అందుకునే దిశగా అడుగులు వేస్తోంది.
‘పెళ్లి సందD’ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఆ బ్యూటీ ‘ధమాకా’లో రవితేజకి జోడీగా నటించి సూపర్ హిట్ అందుకుంది. ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన ‘గుంటూరు కారం’లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఆడిపాడింది. ఈ సినిమాలోని కుర్చీ మడతపెట్టి సాంగ్ తో డాన్సింగ్ క్వీన్ అనే ఇమేజ్ తెచ్చేసుకుంది. ఇదిలా ఉంటే డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న మోస్ట్ హ్యాపెనింగ్ మూవీ ‘పుష్ప 2’లోని కిస్సిక్ సాంగ్ తో ఈ బ్యూటీకి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది.
ఈ సాంగ్ లో అల్లు అర్జున్ తో కలిసి అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. శ్రీలీల డాన్స్ పెర్ఫార్మెన్స్ ని తెరపై చూడటానికి ఆమె ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ హిట్ అయితే కచ్చితంగా శ్రీలీల క్రేజ్ పెరిగిపోవడం గ్యారెంటీ అనుకుంటున్నారు. ఈ నెలలో శ్రీలీల హీరోయిన్ గా నటించిన ‘రాబిన్ హుడ్’ మూవీ కూడా రిలీజ్ కి సిద్ధం అవుతోంది. నితిన్ హీరోగా వెంకి కుడుముల దర్శకత్వంలో కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కింది.
ఇదిలా ఉంటే శ్రీలీల ఈ మధ్య ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉంటుంది. రెగ్యులర్ గా గ్లామర్ ఫోటోలని షేర్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టాలో ఆమె వైట్ కలర్ చీరలో ఉన్న స్టైలిష్ గ్లామర్ పిక్స్ పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ తెల్లచీరలో శ్రీలీల దివి నుంచి దిగివచ్చిన అప్సరసల ఉందనే కామెంట్స్ వస్తున్నాయి. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే అని ప్రశంసిస్తున్నారు.