హాలీవుడ్ తో పోటీ పడాలంటే టాలీవుడ్ కి ఏఐ!
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన హరీష్ రావు పై విధంగా స్పందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాలీవుడ్ పరిశ్రమతో పోటీ పడుతుందని అభిప్రాయపడ్డారు.
By: Tupaki Desk | 12 Jan 2025 1:30 PM GMTసినిమా ఇండస్ట్రీలో ఏఐ టెక్నాలజీపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఏఐ పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తే గనుక ఉపాధి కోల్పోవడం ఖాయమంటూ ఇప్పటికే కొందరు సంగీత దర్శకులు, గాయకులు కూడా అభిప్రా యపడ్డారు. హీరోలే కుండానే ఉన్నట్లు క్రియేట్ చేసి సన్నివేశాలు పూర్తి చేయోచ్చు. అప్పుడు ఆ హీరో నుంచి రైట్స్ తీసుకుంటే చాలు. అతడు సెట్స్ లో లేకపోయినా పని పూర్తవుతుంది. విజువల్ ఎఫెక్స్ట్ లోనూ, సీజీ వర్క్ లోనూ ఏఐ కీలక భూమికగా మారింది.
అన్నింటా ఏఐ సహాయంతో పని సులభమైంది. దీంతో టెక్నికల్ గా బ్యాకెండ్ లో పనిచేసే మానవ సామర్ధ్యం కూడా తగ్గుతుంది. ఆ రకంగా చూస్తే తాము కూడా ఉపాధి కోల్పోతున్నామనే వాదనా తెరపైకి వచ్చింది. తాజాగా టాలీవుడ్ కి ఏఐ టెక్నాలజీ అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి హరీష్ రావు కూడా అభిప్రాయ పడ్డారు. హైదరాబాద్‌లో కల్పర వీఎఫ్ఎక్స్ అండ్ ఏఐ టెక్నాలజీ సర్వీసెస్ ను ప్రారంభించింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన హరీష్ రావు పై విధంగా స్పందించారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో హాలీవుడ్ పరిశ్రమతో పోటీ పడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోటీని టాలీవుడ్ సమర్ధవంతంగా ఎదుర్కోవాలం ఏఐ టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. సినిమా బడ్జెట్ ని తగ్గించి విజువల్ ఎఫెక్స్ట్ ను పెంచుతూ ప్రేక్షకు ల్ని ఆకట్టుకోవాలంటే ఈ టెక్నాలజీ అవసరమన్నారు.
ప్రపంచమంతా ఏఐ మయం అవుతోన్న నేపథ్యంలో పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఈ టెక్నాలజీ గురించి తెలుసుకుని ముందుకెళ్లాలన్నారు. ఏఐ పై ఇప్పటికే కొంత మంది దర్శకులు విదేశాలకు వెళ్లి ప్రత్యేక శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ మధ్యనే రాజమౌళి అమెరికాలో ఏఐ గురించి కొంత ట్రైనింగ్ తీసుకున్నారు. అంతకు ముందు కమల్ హాసన్, శంకర్ కూడా ఏఐ గురించి విదేశాల్లో ప్రత్యేక్ష శిక్షణ తీసుకున్నారు.