నిర్మాత వేలు పెట్టడంతోనే ఆ సినిమా అట్లర్ ప్లాప్!
చాలా హాలీవుడ్ సినిమాలు రీసెర్చ్ చేసి ఆ కథ రాసుకున్నాడుట. కానీ ఇంతలో నిర్మాత వచ్చి ఆ కథకి భక్తి నేపథ్యాన్ని జోడించి తీయ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడిగా నీ రేంజ్ మారిపోతుంది.
By: Tupaki Desk | 28 Dec 2024 12:30 AMరచయితల కథల్లో....దర్శకుల మేకింగ్ లో సీనియర్ హీరోలు, నిర్మాతలు సూచనలు, సలహాల్లో భాగంగా ఇన్వాల్వ్ అవుతుంటారు. వాళ్ల అభిరు మేరకు ఆ కథల్లో...సన్నివేశాల్లో అప్పుడప్పుడు మార్పులు చేయాల్సి వస్తోంది. ఆ పని దర్శకుడికి ఇష్టం ఉన్నా? లేకపోయినా రాజీ పడక తప్పదు. అలా కల్పించుకున్న సందర్భంలో కొన్నిసార్లు ఆ సినిమాలు సక్సెస్ అవుతుంటాయి. మరికొన్నిసార్లు ఫెయిలవుతుంటాయి. అయితే ఎక్కువగా ఫెయిలవ్వడానికే అవకాశం ఉంటుంది.
క్రియేటివ్ గా దర్శక, రచయితలు ఒకటునుకుంటే? అక్కడ ఎదురయ్యే సన్నివేశం మరోలా ఉంటుంది. ఇటీవలే టాలీవుడ్ లో ఓ సినిమా..కోలీవుడ్ లో ఓ సినిమా అలా వేళ్లు పెట్టడంతో డిజాస్టర్ల అయ్యాయి. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. కొన్నేళ్ల క్రితం స్టార్ హీరోతో ఓ డైరెక్టర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ యాక్షన్ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ సినిమా నిర్మాత మోస్ట్ సీనియర్. హీరోలకు, దర్శకులకు సలహా ఇచ్చేంత అనుభవం ఆయన సొంతం.
ఈ నేపథ్యంలో ఆ త్రయంలో మొదలైన సినిమాకి ఓ సలహా ఇచ్చారు. దర్శకుడు కథని తాను రాసుకున్న విధంగా పెద్ద ఎత్తున తీయాలనుకున్నాడు. అతడి ప్లానింగ్ ఎంతలా ఉందంటే? ఏకంగా హాలీవుడ్ చిత్రం 'మిషన్ ఇంపాజుబుల్' రేంజ్ లో తీయాలనుకున్నాడు. దానికి అవసరమైన హోమ్ వర్క్ అంతా చేసాడు. చాలా హాలీవుడ్ సినిమాలు రీసెర్చ్ చేసి ఆ కథ రాసుకున్నాడుట. కానీ ఇంతలో నిర్మాత వచ్చి ఆ కథకి భక్తి నేపథ్యాన్ని జోడించి తీయ్ బ్లాక్ బస్టర్ అవుతుంది. దర్శకుడిగా నీ రేంజ్ మారిపోతుంది. తిరుగుండదు అని సలహా ఇచ్చారుట.
ఆ సలహా దర్శకుడికి ఇష్టం లేకపోయినా పెద్ద నిర్మాత చెప్పాడు కాబట్టి దాన్ని పాటించాల్సిందే. అలా తాను రాసుకున్న కథకి మళ్లీ భక్తిని జోడించి రిప్లేర్లు చేసాడు. దిగ్విజయంగా సినిమా పూర్తయింది. అటుపై థియేటర్లలో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. సినిమాలో యాక్షన్ సన్నివేశాలకు మంచి పేరొచ్చింది. అంతవరకూ ఆ హీరోని ఆ రేంజ్ లో ఏ డైరెక్టర్ ఎలివేట్ చేయలేదు. నిజంగా కొన్ని హెలికాప్టర్ షాట్లు అలాగే పండాయి. మరి సినిమా ఎక్కడ పోయిందంటే? ఆ సినిమాకి భక్తిని జోడించడంతోనే తేడా కొట్టేసింది. సీరియస్ గా జరిగే యాక్షన్ స్టోరీలోకి ఒక్కసారిగా భక్తి నేపథ్యం తోడయ్యే సరికి కథ స్వరూపమే మారిపోయింది. దెబ్బకి థియేటర్ల నుంచి ఆ సినిమాని రెండో రోజే తీసేసారు.