Begin typing your search above and press return to search.

టాలీవుడ్ లో భారీ బడ్జెట్ ఫెయిల్యూర్స్.. గేమ్ ఛేంజర్ మిస్సయ్యింది కానీ..

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ఓ పక్క ఘనవిజయాలు సాధిస్తుంటే, మరోపక్క కొన్ని చిత్రాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయి

By:  Tupaki Desk   |   20 Jan 2025 1:30 PM GMT
టాలీవుడ్ లో భారీ బడ్జెట్ ఫెయిల్యూర్స్.. గేమ్ ఛేంజర్ మిస్సయ్యింది కానీ..
X

టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలు ఓ పక్క ఘనవిజయాలు సాధిస్తుంటే, మరోపక్క కొన్ని చిత్రాలు భారీ స్థాయిలో ఆర్థిక నష్టాలను మిగులుస్తున్నాయి. తాజాగా విడుదలైన రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా కూడా టాలీవుడ్ భారీ నష్టాల జాబితాలో చేరింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో ఆడకపోవడం నిర్మాతకు గతంలో ఎప్పుడు లేనంత స్ట్రోక్ ఇచ్చింది.

కానీ నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా సినిమా కొంత ఆదాయం పొందడంతో నిర్మాత దిల్ రాజు పూర్తిగా నష్టపోకుండా తేరుకున్నారు. గేమ్ ఛేంజర్ సినిమాను దిల్ రాజు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. కానీ ఈ సినిమాకు సరైన పాజిటివ్ టాక్ దొరకకపోవడం, భారీ బడ్జెట్ వెనుక ఉన్న అంచనాలను అందుకోలేకపోవడం వల్ల ఆర్థిక నష్టాలు తప్పడం లేదు.

ప్రస్తుతం దిల్ రాజు కెరీర్‌లో అత్యధిక నష్టాలను మిగిల్చిన సినిమాగా ఇది నిలిచింది. ఈ స్థాయిలో ఫ్లాప్ లో ఉన్న శంకర్ తో బిగ్ బడ్జెట్ సినిమా చేయడం దిల్ రాజుకి రిస్క్ అనే సంకేతాలు ముందుగానే వచ్చినప్పటికీ అనేక కారణాల వలన ఆ సినిమా బడ్జెట్ పెరిగింది. ఇక టాలీవుడ్‌లో ఈ తరహా ఫెయిల్యూర్స్ ఇదే మొదటిసారి కాదు. గతంలో చాలా పెద్ద సినిమాలు భారీ బడ్జెట్‌తో విడుదలై, బాక్సాఫీస్ దగ్గర భారీ నష్టాలను ఎదుర్కొన్నాయి.

ఎన్టీఆర్ కథానాయకుడు, లైగర్, భోళా శంకర్ వంటి సినిమాలు భారీ స్థాయిలో బడ్జెట్ పెట్టి నిర్మించినప్పటికీ, నిర్మాతలకు అనుకున్న రాబడిని అందించలేకపోయాయి. ఈ చిత్రాలు థియేట్రికల్ రాబడిలో కనీసం 40% కూడా రికవరీ చేయలేకపోయాయి. గేమ్ ఛేంజర్ తో పోల్చుకుంటే, ఈ సినిమాలు కూడా భారీ అంచనాలతో ప్రారంభమైనప్పటికీ, చివరికి అందరి ఆశలను తారుమారు చేశాయి.

ప్రత్యేకించి స్టార్ స్టామినాతో వచ్చిన రాధే శ్యామ్, ఆచార్య సినిమాలు భారీ స్థాయిలో డిజాస్టర్ కావడం చూస్తే, టాలీవుడ్‌లో బడ్జెట్ ప్లానింగ్ మీద తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం వచ్చినట్టే. అయితే, గేమ్ ఛేంజర్ నాన్ థియేట్రికల్ రైట్స్ బలంతో కొంత నష్టాన్ని కవరయ్యింది. అయితే రానున్న రోజుల్లో కంటెంట్ విషయంలో ఎంత పెద్ద స్టార్ అయినా జాగ్రత్తలు తీసుకోవాలి అని అర్ధమవుతుంది.

టాలీవుడ్ భారీ ఫెయిల్యూర్స్ జాబితా:

డబుల్ ఇస్మార్ట్ - 22% రికవరీ

ఎన్టీఆర్ కథానాయకుడు - 28% రికవరీ

లైగర్ - 31% రికవరీ

భోళా శంకర్ - 33% రికవరీ

ఆచార్య - 35% రికవరీ

రాధే శ్యామ్ - 40% రికవరీ

గేమ్ ఛేంజర్ అయితే ఈ జాబితాలో పెద్ద నష్టం కాకపోయినా, దిల్ రాజు కెరీర్‌లో ఇదే అతిపెద్ద ఆర్థిక నష్టంగా నిలిచింది. టాలీవుడ్‌లో భారీ బడ్జెట్ సినిమాలకు పాజిటివ్ టాక్ ఎంత కీలకమో ఈ జాబితా మరోసారి గుర్తు చేస్తుంది. గేమ్ ఛేంజర్ ను దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా సినిమా థియేట్రికల్ గా ఇప్పటివరకు 200 కోట్లను టచ్ చేయలేదు. ఇక లెక్క ఫుల్ రన్ లో ఎంతవరకు వెళుతుందో చూడాలి.