స్టార్ హీరోల రిలీజ్ వాయిదాలతో ఇండస్ట్రీకి ఇబ్బందే!
అగ్ర హీరోల చిత్రాలేవి ప్రకటించిన తేదీకి ప్రేక్షకుల ముందుకు రావు. కొంత మంది హీరోలు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే రిలీజ్ తేదీ ప్రకటిస్తారు.
By: Tupaki Desk | 22 Jan 2025 4:30 PM GMTఅగ్ర హీరోల చిత్రాలేవి ప్రకటించిన తేదీకి ప్రేక్షకుల ముందుకు రావు. కొంత మంది హీరోలు ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందే రిలీజ్ తేదీ ప్రకటిస్తారు. మరికొంత మంది ప్రారంభోత్సవం అనంతరం..ఇంకొంత మంది షూట్ మధ్యలో... మరికొంత మంది చిత్రీకరణ పూర్తయిన తర్వాత రిలీజ్ తేదీలను ప్రకటిస్తుంటారు. ఇలా ప్రకటించడంలో తప్పు లేదు. కానీ ప్రకటించిన తర్వాత అదే తేదీకి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మాత్రం జాప్యం తప్పడం లేదు.
ప్రముఖంగా స్టార్ హీరోల చిత్రాల రిలీజ్ కే ఈ సమస్య ఏర్పడుతుంది. గత ఏడాది సమ్మర్ లో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా రిలీజ్ కి లేదు. వాళ్లతో పాటు టైర్-2, టైర్ -3 హీరోలు కూడా రిలీజ్ కు రాలేదు. ఇంకా చిన్నా చితకా చిత్రాలు కూడా రిలీజ్ కాలేదు. దీనంతటకీ కారణంగా స్టార్ హీరోల చిత్రాలే. వాళ్ల సినిమా షూటింగ్ ల డిలే కారణమా? మరోటా ? అన్నది పక్కన బెడితే? వాళ్లు ముందుగా ప్రకటించిన తేదికి ఫిక్సై ఉంటారు? కదా అన్న నమ్మకంతో ఇతర హీరోలు ఆ తేదీల్ని వదిలేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి.
గత ఏడాది సమ్మర్ లో ఇదే పరిస్థితి ఎదురైంది. అందుకే వేసవి లో ఒక్క సినిమా కూడా రిలీజ్ కి నోచుకోక థియేటర్లు మూసు కోవాల్సి వచ్చింది. చూస్తుంటే 2025 వేసవి కూడా అలాగే కనిపిస్తుంది. `విశ్వంభర`, `రాజాసాబ్`, `హరిహర వీరమల్లు` చిత్రాలు వేసవిలో రిలీజ్ అవుతాయంటున్నారు. కానీ ఇంత వరకూ అధికారికంగా వాళ్లెవ్వరూ రిలీజ్ తేదీలు ప్రకటించలేదు. ఊహకి అనుకోవడం తప్ప అందులో క్లారిటీ లేదు.
వీరమల్లు రిలీజ్ దాదాపు లేనట్లే అంటున్నారు. ఈ నేపథ్యంలో నితిన్ `రాబిన్ హుడ్` రిలీజ్ తేదీ వేసుకున్నారు. దీంతో వీరమల్లు రిలీజ్ దాదాపు లేనట్లుగానే తెలుస్తోంది. వీరమల్లు నిర్మాతలు మాత్రం మార్చి 28న ఎట్టి పరిస్తు తుల్లో రిలీజ్ చేస్తామని అభిమానులకు మాట ఇచ్చారు. కానీ ఇప్పుడా మాట తప్పుతున్నారు. సమ్మర్ లో ఇలా అగ్ర తారల సినిమా రిలీజ్ లు ఉంటాయని భావించి మరికొన్ని సినిమాలు రిలీజ్ కి రాలేదు. ఆ రకంగా వాళ్లు కీలకమైన రిలీజ్ తేదీల్ని నష్టపోవాల్సి వస్తోంది.