Begin typing your search above and press return to search.

డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టాలీవుడ్ కొరియోగ్రాఫర్!!

ఈ క్రమంలో తాజాగా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం మరోసారి కలకలం రేపిందనే చర్చ మొదలైంది.

By:  Tupaki Desk   |   2 Dec 2024 5:33 AM GMT
డ్రగ్స్ పార్టీలో పట్టుబడ్డ టాలీవుడ్  కొరియోగ్రాఫర్!!
X

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలువురు నటీనటులు, టెక్నీషియన్లు డ్రగ్స్ పార్టీల్లో పట్టుబడ్డారనే కథనాలు గతంలో తీవ్ర సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరోసారి టాలీవుడ్ లో డ్రగ్స్ పార్టీ వ్యవహారం మరోసారి కలకలం రేపిందనే చర్చ మొదలైంది. ఈ సమయంలో పట్టుబడ్డవారిలో ఓ కొరియోగ్రాఫర్ ఉన్నారని అంటున్నారు.

అవును... టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ పార్టీ వ్యవహారం కలకలం రేపింది! ఇందులో భాగంగా... హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ హోటల్ లోని ఓయో రూమ్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందనే పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేపట్టారని సమాచారం. ఈ సమయంలో మద్యంతో తో పాటు డ్రగ్స్ తీసుకుంటున్న పలువురిని పట్టుకున్నారని అంటున్నారు.

ఇలా పోలీసులకు పట్టుబడినవారిలో టాలీవుడ్ కు చెందిన కొరియోగ్రాఫర్ కన్హ మహంతి (కన్నా) ఉన్నారని మీడియాలో కథనాలొస్తున్నాయి! ఇతడితో పాటు ప్రముఖ మహిళా ఆర్కిటెక్టర్ ని పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని అంటున్నారు. ఆ మహిళా ఆర్కిటెక్ట్ ఇచ్చిన పార్టీలోనే ఈ యువ కొరియోగ్రాఫర్ పాలొన్నారని చెబుతున్నారు.

వీరితో పాటు ఈ పార్టీలో పాల్గొన్న మరో నలుగురిని మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు చెబుతున్నారు. ఎండీఎంఏ డ్రగ్స్ తో పాటు మరో రెండు మూడు రకాల డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం పట్టుబడిన నిందితులను పోలీస్ స్టేషన్ కు తరలించి.. ఈ డ్రగ్స్ వీరి చేతికి ఎలా దొరికాయనే విషయంపై ఆరాతీస్తున్నారని అంటున్నారు!