ఆ వివాదంపై సంచలనాల వర్మ కామెంట్ ఇది!
తెలుగు సినిమా కొరియోగ్రఫీ ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారుతోన్న సంగతి తెలిసిందే.
By: Tupaki Desk | 3 April 2025 8:00 AMతెలుగు సినిమా కొరియోగ్రఫీ ఈ మధ్య కాలంలో వివాదాస్పదంగా మారుతోన్న సంగతి తెలిసిందే. `మిస్టర్ బచ్చన్`, `డాకు మహారాజ్`, `రాబిన్ హుడ్` చిత్రాల పాటల కంపోజింగ్ అన్నది హద్దు మీరిందని విమర్శలు తీవ్ర స్థాయిలో వ్యక్తమయ్యాయి. సోషల్ మీడియా వేదికగా కొన్ని స్టెప్పులపై నెటి జనులు దుమ్మెత్తిపోసారు. అందమైన పాటకు అద్భుతమైన కొరియోగ్రఫీ దూరమవుతుందని కొరియోగ్రఫీలో వల్గార్టీ హైలైట్ అవుతుందనే అంశాన్ని తెరపైకి వస్తోంది.
దీనికి సంబంధించి ఇండస్ట్రీ నుంచి ఎవరూ స్పందించలేదు. కానీ తాజాగా సంచలనాల రాంగోపాల్ వర్మ ఈ వివాదంపై స్పందించారు. డాన్సులో వల్గార్టీపై ఎప్పటి నుంచో వివాదం ఉందన్న అంశాన్ని గుర్తు చేసారు. కొన్ని స్టెప్పులు కొందరికి నచ్చుతాయని మరికొందరకు నచ్చవన్నారు. నచ్చని వాళ్లంతా దాన్ని వివాదం చేస్తారని అన్నారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఇప్పుడంతా మాట్లాడుకుంటున్నారు? సోషల్ మీడియాలో లేని రోజుల్లో మాట్లాడుకునే విషయాలు బయటకు తెలియలేదన్నారు.
పాటల కంపోజింగ్ విషయంలో నైతికత-అనైతికత గురించి పట్టించు కోవాల్సిన పనిలేదన్నారు. ఈ విషయంలో ఎవరు రైట్..ఎవరు రాంగ్ అన్నది చెప్పలేమన్నారు. ఎవరి ఇష్టం వారికుంటుందని దాన్ని గౌరవించాలనుకున్న వాళ్లు గౌరవించొచ్చు కాదనుకున్న వాళ్లు వదిలేస్తే సరిపోతుందన్నారు. వర్మ ఈ విషయం చెప్పగానే గతంలో ఓ మాజీ స్టార్ డైరెక్టర్ చేసిన ఓ కామెంట్ కూడా గుర్తించాలి.
సినిమాల విషయంలో చాలా మంది దర్శకులు కాపీ కొడతారు? అన్న విషయంపై ఓ సందర్భంలో ఆయన కూడా కుండబద్దలగొట్టి మాట్లాడారు. సోషల్ మీడియా ఉంది కాబట్టి ఎక్కడ నుంచి కాపీ కొడుతున్నారో తెలిసిపోతుంది. మరి సోషల్ మీడియాలో లేనప్పుడు? తెలిసేదేలా. కాపీ అన్నది ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉండనే ఉందని అభిప్రాయ పడ్డారు.