Begin typing your search above and press return to search.

ఆగష్టులో కంటెంట్ కింగ్.. క్లిక్కయిన సినిమాలివే..

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు కథలు తయారు చేసుకునే విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   1 Sep 2024 8:51 AM GMT
ఆగష్టులో కంటెంట్ కింగ్.. క్లిక్కయిన సినిమాలివే..
X

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా దర్శకులు కథలు తయారు చేసుకునే విధానం మార్చుకోవాల్సిన అవసరం ఉందనే మాట చాలా కాలంగా వినిపిస్తోంది. అలాగే హీరోలు కూడా ఇంటరెస్టింగ్ ఎలిమెంట్స్ తో ఉన్న కథలకి ప్రాధాన్యత ఇవ్వాల్సిందేనని ట్రెండ్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఆగష్టులో రిలీజ్ అయిన మూవీస్ చూస్తే ప్రేక్షకుల టేస్ట్ ఎలా ఉందనేది మరోసారి స్పష్టం అవుతోంది. కొత్తదనం, ఎంటర్టైన్మెంట్ ఉన్న కథలతో వచ్చిన సినిమాలకి ఆడియన్స్ పట్టం పట్టగా, రెగ్యులర్ కమర్షియల్ లైన్ లో తెరకెక్కిన వాటికి అస్సలు ఆదరణ లభించలేదు.

ఆగష్టు మొత్తం 37 సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి. వాటిలో మొదటి వారం రాజ్ తరుణ్ తిరగబడర సామి, వరుణ్ సందేశ్ విరాజి, అశ్విన్ బాబు శివంభజే, విజయ్ భాస్కర్ కె దర్శకత్వంలో ఉషా పరిణయం, అల్లు శిరీష్ బడ్డీ మూవీస్ థియేటర్స్ లోకి వచ్చాయి. వీటిలో ఏ ఒకటి ప్రేక్షకులని మెప్పించలేదు. బడ్డీ సినిమాకి ప్రమోషన్స్ గట్టిగా చేసిన కూడా ఇది వరకే టెడ్డీ సినిమాలో అదే కథని చూసేయడంతో ప్రేక్షకులు ఆదరించలేదు.

ఇక రెండో వారంలో నిహారిక కొణెదల నిర్మించిన కమిటీ కుర్రోళ్ళు, అనసూయ, జగపతిబాబు లీడ్ రోల్ చేసిన సింబ, సంఘర్షణ, విజయ్ ఆంటోనీ తుఫాన్, భవనంతో పాటు మరికొన్ని చిన్న సినిమాలు రిలీజ్ అయ్యాయి. వీటిలో కమిటీ కుర్రోళ్ళు సినిమా మాత్రమే ప్రేక్షకులని ఆకట్టుకుంది. అందరూ కొత్తవాళ్లతో తెరకెక్కిన కూడా ఎంటర్టైన్మెంట్ ఎలిమెంట్స్, అంతకుమించి ప్రేక్షకులు రిలేట్ చేసుకునే అంశాలు కథలో ఉండటంతో మూవీ సూపర్ సక్సెస్ అయ్యింది.

ఆగష్టు 15న రామ్ పోతినేని పూరి కలయికలో తెరకెక్కిన డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ అయ్యింది. రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో సిద్ధమైన మిస్టర్ బచ్చన్ ప్రేక్షకుల ముందుకొచ్చింది ఈ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నాయి. రొటీన్ కమర్షియల్ ఫార్ములా కథలతో తెరకెక్కడం వలన ఈ సినిమాలు ఫ్లాప్ అయ్యాయనే మాట వినిపించింది. వీటికి పోటీగా రిలీజ్ అయిన ఆయ్ మూవీ అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైన్మెంట్ తో సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. నిర్మాత బన్నీ వాస్ కి ఆయ్ మంచి సక్సెస్ ని అందించింది.

మూడో వారంలో రావురమేష్ లీడ్ రోల్ లో నటించిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం రిలీజ్ అయ్యింది. ఇంటరెస్టింగ్ స్టోరీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. డీసెంట్ హిట్ గా నిలిచింది. దాంతో పాటు వచ్చిన రేవు, యజ్ఞ పెద్దగా మెప్పించలేదు. నాలుగో వారంలో నాచురల్ స్టార్ నాని సరిపోదా శనివారంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఈ నెల రోజుల్లో రిలీజ్ అయిన సినిమాలలో చూసుకుంటే చిన్న సినిమాలుగా వచ్చిన కమిటీ కుర్రోళ్ళు, ఆయ్, మారుతీనగర్ సుబ్రహ్మణ్యం బాక్సాఫీస్ దగ్గర హిట్ బొమ్మలుగా నిలిచాయి. అలాగే స్టార్ హీరోల చిత్రాలలో సరిపోదా శనివారం మాత్రమే కమర్షియల్ సక్సెస్ దిశగా దూసుకెళ్తోంది.