డాకు మహారాజ్.. ఆక్యుపెన్సీ లెక్క తగ్గింది కానీ..
ఇక వారం రోజుల తర్వాత కలెక్షన్లు తగ్గడం అనేది టాలీవుడ్‌లో చాలా సాధారణంగా మారింది. "డాకు మహారాజ్" కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది.
By: Tupaki Desk | 23 Jan 2025 1:52 PM GMTటాలీవుడ్‌లో నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన క్రేజ్‌ను తెచ్చుకుంటాయి. గతంలో మాస్ ఎంటర్టైనర్స్‌లో హీరోలను ప్రత్యేకంగా చూపించిన అనుభవం కలిగిన దర్శకుడు బాబీ కొల్లి, ఇప్పుడు డాకు మహారాజ్ అంటూ బాలయ్యతో సరికొత్తగా మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ చిత్రం నెవ్వర్ బిఫోర్ అనేలా బాలయ్య న్యూ లుక్‌తో, యాక్షన్ డ్రామాగా ఓ వర్గం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే మొదటి వారం కలెక్షన్ల పరంగా మంచి వసూళ్లు రాబట్టినా, మెల్లగా ఈ చిత్రం కలెక్షన్లు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
ప్రధానంగా ఫెస్టివల్ సీజన్ ప్రభావంతో సినిమా తొలి నాలుగు రోజుల్లో భారీగా కలెక్షన్లను సాధించింది. నైజాంలో మొదటిరోజు హౌస్‌ఫుల్ షోలు, ఏపీలోని పలు ప్రాంతాల్లో పాజిటివ్ టాక్‌తో సినిమాకు మంచి బూస్ట్ లభించింది. ఇక వారం రోజుల తర్వాత కలెక్షన్లు తగ్గడం అనేది టాలీవుడ్‌లో చాలా సాధారణంగా మారింది. "డాకు మహారాజ్" కూడా ఈ సమస్యను ఎదుర్కొంటుంది.
ఇక ట్రేడ్ వర్గాల ప్రకారం, వర్కింగ్ డేస్‌లో 50% వరకు ఆడియన్స్ తగ్గడంతో కలెక్షన్లు బాగా తగ్గిపోయాయి. బాలయ్య నటనకు, బాబీ కొల్లి దర్శకత్వానికి మంచి ప్రశంసలు దక్కినా, సినిమా ఆడియన్స్‌ను థియేటర్లకు మరింత కాలం లాగలేకపోయింది. ఇక అభిమానులు కూడా తదుపరి వీకెండ్‌ను ఆశగా చూస్తున్నారు. అయితే, నిర్మాతల దృష్టిలో ఇది పెద్ద సమస్యగా అయితే లేదు. సినిమా బిజినెస్ ప్రాఫిట్‌కు చేరుకుంది, అంటే బ్రేక్ ఈవెన్ దాటేసింది.
బాబీ కొల్లి స్టోరీ మేకింగ్, బాలయ్య పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ మీద ఆధారపడి ఈ చిత్రం తొలి వారం లోనే మంచి రిటర్న్స్ సాధించగలిగింది. కానీ ఇప్పుడు వసూళ్లలో వచ్చే మార్పు, చిత్రానికి చివరి దశలో ఎంతవరకు ప్రభావం చూపుతుందో చూడాలి. సినిమాకు వీకెండ్ నాటికి మరో అవకాశం లభిస్తే, కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంది. బాలయ్య అభిమానులు ఎప్పటికీ సినిమాకు సపోర్ట్ చేస్తారు కాబట్టి, ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించగలిగితే, కలెక్షన్లను కొంతవరకు కాపాడవచ్చు.
మొత్తం మీద, డాకు మహారాజ్ ఒక కమర్షియల్ విజయం అని చెప్పడం లో సందేహం లేదు. కానీ, ఈ సినిమా సీజనల్ డిమాండ్‌ను మాత్రమే నిలబెట్టుకోగలిగిందని స్పష్టమవుతోంది. అలాగే బాబీ కొల్లి, బాలకృష్ణ కాంబినేషన్ నుంచి వచ్చే తదుపరి ప్రాజెక్ట్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరో రెండో సినిమా బాలయ్యకు అఖండ లాంటి విజయం ఇస్తుందా లేదా అనేది చూడాలి.