పాన్ ఇండియా ట్రెండ్ ఫాలో కాని డైరెక్టర్లు!
టాలీవుడ్ పాన్ ఇండియాలో ఇప్పుడో సంచలనం. తెలుగు ఇండస్ట్రీ నుంచి తదుపరి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా ఏది అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుంది.
By: Tupaki Desk | 20 Dec 2024 6:30 PM GMTటాలీవుడ్ పాన్ ఇండియాలో ఇప్పుడో సంచలనం. తెలుగు ఇండస్ట్రీ నుంచి తదుపరి రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమా ఏది అనే చర్చ దేశ వ్యాప్తంగా జరుగుతుంది. కానీ పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అవ్వడనికి మాత్రం చాలా సమయం పడుతుంది. అందుకు కారణంగా పాన్ ఇండియాలో సినిమాలు చేయడం అన్నది కేవలం ముగ్గురు -నలుగురు డైరెక్టర్లకు మాత్రమే చేతనవుతుంది. రాజమౌళి, సుకుమార్, చందు మొండేటి, ప్రశాంత్ వర్మ, ప్రశాంత్ నీల్ లాంటి వారే చేయగల్గుతున్నారు.
మిగతా డైరెక్టర్లు మాత్రం రీజనల్ మార్కెట్ కే పరిమితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లపై చిన్న విమర్శ కూడా తెరపైకి వస్తుంది. వాళ్లంతా అప్ డేట్ కాకపోవడం వల్లే పాన్ ఇండియా కంటెంట్ తక్కువ అవుతుందన్నది మరో ప్రధాన కారణంగా కనిపిస్తుంది. ఓసారి ఆ డైరెక్టర్ల సంగతి చూస్తే అనీల్ రావిపూడికి ఇంతవరకూ రీజనల్ మార్కెట్ పరంగా ఫెయిల్యూర్ లేదు. చేసిన ప్రతీ సినిమా మంచి విజయం సాధించింది. బాక్సాఫీస్ వద్ద కోట్ల వసూళ్లు రాబట్టాయి.
అలాగే మాస్ డైరెక్టర్ బాబి సక్సెస్ రేట్ బాగుంది. స్టార్ హీరోలతో కమర్శియల్ సినిమాలు చేయడం అతడి ప్రత్యేకత. తనదైన మార్క్ యాక్షన్ తో మాస్ ఆడియన్స్ కి అతడి సినిమాలు బాగా కనెక్ట్ అవుతాయి. ఇదే తరహాలో గోపీచంద్ మలినేని సినిమాలు కూడా ఉంటాయి. ఇప్పుడాయన ఏకంగా బాలీవుడ్ కి వెళ్లి సన్ని డియోల్ హీరోగా ఓ సినిమా కూడా చేస్తున్నాడు. అయితే వీళ్లెవ్వరూ కూడా పాన్ ఇండియా సినిమాల జోలికి వెళ్లడం లేదు. ట్రెండ్ ని అసలే ఫాలో అవ్వడం లేదు.
ఇప్పటివరకూ వాళ్లు చేసిన కథల పరంగా చూస్తే అవేవి పాన్ ఇండియాకి కనెక్ట్ అయ్యే చిత్రాలు కాదు. మరి ట్రెండ్ మారినా? ఇంకా రీజనల్ మార్కెట్ కే వాళ్లు పరిమితం అవ్వడం విమర్శలకు దారి తీసే అవకాశం లేకపోలేదు. త్రివిక్రమ్ కూడా త్వరలో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ఓ సినిమా కి సన్నాహాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.